హైదరాబాద్‌లో సెంట్రల్ 2వ స్టోర్ | Central 2nd store in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సెంట్రల్ 2వ స్టోర్

Published Sat, Oct 18 2014 12:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

హైదరాబాద్‌లో సెంట్రల్ 2వ స్టోర్ - Sakshi

హైదరాబాద్‌లో సెంట్రల్ 2వ స్టోర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన లైఫ్ స్టైల్ రిటైల్ బ్రాండ్ సెంట్రల్.. హైదరాబాద్‌లో రెండవ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్‌లో లక్షకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. దుస్తులు, వాచీలు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వంటి 100కుపైగా విభాగాలకు చెందిన ఉత్పత్తులు సెంట్రల్‌లో లభిస్తాయి. 500పైగా బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరాయని సెంట్రల్ సీఈవో విష్ణు ప్రసాద్ తెలిపారు. నైకి, ప్యూమా, స్కెచర్స్, జాక్ అండ్ జోన్స్, యూఎస్ పోలో, అర్మాణీ, లివైస్, డేవిడఫ్, వాన్ హ్యూసెన్, లూయీ ఫిలిప్, రెడ్ టేప్, ఫాస్ట్‌ట్రాక్ వంటి అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.  సెంట్రల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 29కి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement