జనరల్ మోటార్స్ ట్రైల్‌బ్లేజర్ వచ్చేసింది | Chevrolet Trailblazer SUV launched in India at Rs 26.4 lakh | Sakshi
Sakshi News home page

జనరల్ మోటార్స్ ట్రైల్‌బ్లేజర్ వచ్చేసింది

Published Thu, Oct 22 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

జనరల్ మోటార్స్ ట్రైల్‌బ్లేజర్ వచ్చేసింది

జనరల్ మోటార్స్ ట్రైల్‌బ్లేజర్ వచ్చేసింది

ధర రూ.26.40 లక్షలు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీ ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ) సెగ్మెంట్లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. షెవర్లే ట్రైల్‌బ్లేజర్ పేరుతో అందిస్తున్న ఈ ఎస్‌యూవీ ధర రూ.26.40 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అని జనరల్ మోటార్స్ ఇండియా తెలిపింది. భారత్‌లో అమ్మకాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా రానున్న ఐదేళ్లలో పది కొత్త మోడళ్లను జనరల్ మోటార్స్ ఇండియా తీసుకురానున్నది. ఆ పదింటిలో ఇది మొదటిదని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా పేర్కొన్నారు.

2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపాందిన ఈ ఎస్‌యూవీని థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని వివరించారు. ఇది అచ్చమైన షెవర్లే కారు అని తెలిపారు. అమెజాన్‌డాన్‌ఇన్ ద్వారా ఈనెల 21 నుంచి 25 తేదీల మధ్యలో ఈ కారు కోసం బుకింగ్‌లు చేసుకోవచ్చని, రూ. 25,000 డిపాజిట్ చేయాలని స్థానిక,  షెవర్లే డీల ర్ల ద్వారా డెలివరీ తీసుకోవచ్చని తెలిపారు.
 
షెవర్లే ట్రైల్‌బ్లేజర్ ప్రత్యేకతలు..
ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వెనక భాగంలో ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్స్‌ను సీలింగ్‌లో అమర్చడం, ఆరు గేర్లు(ఆటోమేటిక్), 7 అంగుళాల   టచ్‌స్క్రీన్‌తో కూడిన మైలింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఏడుగురు సౌకర్యంగా కూర్చునేలా 3 వరుసల సీట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్-డెసెంట్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, రూఫ్-రెయిల్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement