సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్ సుబ్రమణియన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానికి ఆమోదం తెలపడం మినహా మరో మార్గం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు.
పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ చురుకైన పాత్ర పోషించారు. కాగా 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు.
ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని, ఇవన్నీ అరవింద్ సుబ్రమణియన్‌లో పుష్కలంగా ఉన్నాయని జైట్లీ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment