వాషింగ్టన్: అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు పొరుగునున్న కరీబియన్ దీవి ప్యూర్టోరికోతో కలిపి దాదాపు 100 భారతీయ కంపెనీలు సేవలందిస్తున్నట్లు సీఐఐ తెలియజేసింది. ఇవి 1,13,423 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాయని, ఇవన్నీ కలిసి అమెరికాలో దాదాపు 18 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయని సీఐఐ వెల్లడించింది. ‘అమెరికా నేలపై భారత మూలాలు’ పేరుతో సీఐఐ వాషింగ్టన్‌లో విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాలు తెలియజేసింది. అగ్రరాజ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత కంపెనీలు 147 మిలియన్ డాలర్ల నిధులను అందించాయని, పరిశోధన, అభివృద్ధిపై 588 మిలియన్ డాలర్లను వెచ్చించాయని నివేదిక వెల్లడించింది. భారత కంపెనీలు అత్యధికంగా ఉపాధి కల్పించిన రాష్ట్రాల్లో న్యూజెర్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 8,572 మందిని భారత కంపెనీలు నియమించుకున్నాయి.
టెక్సాస్‌లో 7,271 మందికి, క్యాలిఫోర్నియాలో 6,749 మందికి, న్యూయార్క్‌లో 5,135 మందికి, జార్జియాలో 4,554 మందికి ఉపాధి కల్పించాయి. ఇక భారత కంపెనీలు అధికంగా పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాల్లో న్యూయార్క్ ముందుంది. ఇక్కడ భారత కంపెనీలు 1.57 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. న్యూజెర్సీలో 1.56 బిలియన్ డాలర్లు, మసాచుసెట్స్‌లో 931 మిలియన్ డాలర్లు, కాలిఫోర్నియాలో 542 మిలియన్ డాలర్ల చొప్పున భారత కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. 87 శాతం భారత కంపెనీలు వచ్చే ఐదేళ్లలో మరింత మంది స్థానికులను నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయి.
ఉపాధిలో న్యూజెర్సీ.. పెట్టుబడుల్లో న్యూయార్క్
Published Wed, Nov 15 2017 11:35 PM | Last Updated on Wed, Nov 15 2017 11:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment