ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ మైనర్.. కోల్ ఇండియా ఈసారి రికార్డు స్థాయిలో అభివృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తిలో మార్చి 7వ తేదీ నాటికి 9.3 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ ఈ) కు తెలిపింది.
గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 41.8 మిలియన్ టన్నుల సంపూర్ణ పెరుగుదలతో 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి 7 నాటికి కంపెనీ 9.3 శాతం సానుకూల వృద్ధిని సాధించినట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో నివేదించిన లెక్కల ప్రకారం 9.2 శాతం ఉత్పత్తి వృద్ధితో గత సంవత్సరాన్నే పోలి ఉందని.... విద్యుత్ సంస్థల్లో రెగ్యులేటెడ్ లిఫ్టింగ్ కు సమస్య తెస్తున్న కారణంగా కొన్ని మైన్స్ లో ఉత్పత్తిని ప్రారంభించి నిల్వలను పెంచినట్లు కోల్ ఇండియా వివరించింది.
అయితే ఒక్కోసారి స్టాక్ నిల్వలు కొన్ని నిర్వహణా సమస్యలను సృష్టిస్తాయని, నాణ్యత క్షీణిస్తుందని, అగ్నిప్రమాదాలు కూడ సంభవించే అవకాశం ఉంటుందని దీంతో కొన్ని గనుల్లో ఉత్పత్తిని నియంత్రించినట్లు సంస్థ తెలిపింది. మరింత అభివృద్ధిని సాధించాలంటే కోల్ మైన్స్ లో ఉత్పత్తిని పెంచడం, విద్యుత్ సంస్థల్లో రెగ్యులేటెడ్ లిఫ్టింగ్ సమస్యలను తీర్చడం అవసరమని కోల్ ఇండియా తెలిపింది.
కోల్ ఇండియా రికార్డు స్థాయి అభివృద్ధి
Published Tue, Mar 8 2016 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement