చెన్నై : అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు ఓ వినూత్నకర విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ పనితీరు కనబర్చే ఉద్యోగులకు స్టాక్స్ ఆఫన్స్ బదులు నగదును ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి సీనియర్ మేనేజర్లకు, అసోసియేట్ డైరెక్టర్లకు సమాచారం అందించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ల బదులు ఉద్యోగులు నగదు తీసుకోవాలని కంపెనీ ఆదేశించింది. ఈ ఏడాది మొదట్లోనే ఈ కంపెనీ 3.4 బిలియన్ డాలర్లను వచ్చే రెండేళ్లలో తమ షేర్ హోల్డర్స్‌కు షేర్లు తిరిగి కొనుగోలు, డివిడెండ్ల రూపంలో అందించనున్నట్టు తెలిపింది.
2017 తొలి క్వార్టర్‌లోనే 1.5 బిలియన్ డాలర్లతో షేరును తిరిగి కొనుగోలు చేసే ప్రొగ్రామ్‌ను ప్రారంభించేసింది. ప్రతి క్వార్టర్‌లోనూ ఒక్కో షేరుకు 0.15 డాలర్ల డివిడెండ్‌ను ఇస్తోంది. ''ఇది ఒక ఆసక్తికరమైన అభివృద్ధి. ఈక్విటీ మంజూరు, స్టాక్ ఆప్షన్స్ అత్యుత్తమ ఈక్విటీని విలీనం చేస్తాయి. వీటిని నగదుకు మార్చడం ద్వారా వీరు స్టాక్ బైబ్యాక్ సంస్కరణను సాధించగలిగారు" అని ఎవరెస్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెండోర్ శామ్యూల్ తెలిపారు. బైబ్యాక్‌ను ప్రకటించే ముందే కంపెనీ పలువురు సీనియర్ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ స్కీమ్‌ను ఆఫర్ చేసింది. అంతేకాక బోర్డులో మార్పులు, ఫైనాన్సియల్ కమిటీ ఏర్పాటు వంటి వాటిని చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment