కార్పొరేట్ గవర్నెన్స్‌లో భారత్‌కు 4వ ర్యాంకు
కోల్‌కతా: పారదర్శకమైన, సమగ్రమైన విధానాలతో కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 4వ స్థానాన్ని దక్కించుకుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన అధ్యయనంలో అంతర్జాతీయంగా 25 దేశాల జాబితాలో మలేసియా, ఆస్ట్రేలియా సరసన నిల్చింది. ఈ విషయంలో భారత్.. చైనాను మిం చింది. అటు యూరప్, మధ్య ప్రాచ్య, ఆసియా (ఈఎంఏ) మార్కెట్ల విభాగంలో భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆడిట్ కమిటీ లు, స్వతంత్ర డెరైక్టర్ల పాత్రను, బాధ్యతలను మరింత పెంచడం ద్వారా భారత్ మెరుగైన ర్యాంకింగ్‌లు దక్కించుకోగలిగినట్లు కేపీఎంజీ ఇండియా సీఈవో రిచర్డ్ రేకి తెలిపారు.