క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం | Credit Card Rules tightened | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం

Published Fri, Jul 17 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

క్రెడిట్ కార్డ్  నిబంధనలు కఠినతరం

క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం

న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ నిబంధనావళిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠినతరం చేసింది. పేమెంట్ బకాయి నిర్దేశిత సమయంకన్నా...  మూడు రోజులు దాటితే... ఆ ఆలస్యానికి సంబంధించి క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై జరిమానా విధించాలని, క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది.  బకాయి ఆలస్యం ప్రాతిపదికన జరిమానాలు ఉండాలని నిర్దేశించింది. బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు ‘బకాయి కనీస మొత్తం ’ చెల్లించకపోతే... క్రెడిట్ కార్డ్‌ను ‘మొండి బకాయి పద్దు’(ఎన్‌పీఏ)గా పరిగణించాలని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

రుణ విధానాల్లో అత్యుత్తమ క్రమశిక్షణ ప్రక్రియను పెంపొందించే క్రమంలో ఈ నిబంధనావళిని అమలు చేయాలని సూచించింది. బకాయి తేదీ నాటికి పూర్తి మొత్తాన్ని లేదా అందులో కొంత భాగాన్ని లేదా ఒక కనీస మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు కల్పించాలని ఆర్‌బీఐ సూచించింది. ఈ విధానంలో ఒక వేళ చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇంకా ఉంటే... ఆ మొత్తాన్ని తదుపరి నెల బిల్లింగ్ ప్రక్రియలో చెల్లించేలా అవకాశం కల్పించాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement