ముంబై: దేశంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భయాలు నెలకొన్నాయి. రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నమోదయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే క్యాడ్ 2.9 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 19.1 బిలియన్ డాలర్లు. రెండవ త్రైమాసికంలో ఇది 15.9 బిలియన్ డాలర్లే (జీడీపీలో 2.4 శాతం). గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 6.9 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1శాతం). కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీలో కాŠయ్‌డ్ 1.8 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది.
ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం (ఎప్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలుమినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్‌లోటు. దిగుమతుల బిల్లు తగ్గింపు, ఎగుమతుల పెంపుసహా పలు మార్గాల ద్వారా క్యాడ్‌ను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్యాడ్ ఆ దేశాన్ని ఇతర దేశాలకు రుణగ్రస్థ దేశంగా మార్చుతుంది. క్యాడ్ పెరుగుదల కరెన్సీ విలువల పతనానికీ దారితీస్తుంది. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు పెరగడం తాజా క్యాడ్ గణాంకాలు పెరగడానికి కారణం.
కరెంట్ అకౌంట్ లోటు భయాలు
Published Sat, Dec 8 2018 1:47 AM | Last Updated on Sat, Dec 8 2018 1:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment