ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్ | Delhi-NCR may generate 1 lakh metric tonnes of e-waste per annum | Sakshi
Sakshi News home page

ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్

Published Thu, May 26 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్

ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్

టెలికం పరికరాల నుంచే అధిక ఈ-వేస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 1.03 బిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని, ఏడాదికి 25 శాతం ఈ-వ్యర్ధాల పరిమాణం పెరుగుతోందని సర్వే పేర్కొంది.

దేశంలో 95 శాతం ఈ-వేస్ట్ అసంఘటిత రంగం నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావ రణ, వాతావరణ శాఖ ప్రత్యేకంగా ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను రూపోందించింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఈ- వ్యర్ధాల సేకరణ జరుగుతోందని అధ్యయనం పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement