Telecom equipment
-
మరోసారి దిగుమతి సుంకం పెంపు : ఇక ఆ వస్తువులు కాస్ట్లీ!
న్యూఢిల్లీ : గత నెలలో దాదాపు 19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం పరికరాలపై కూడా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోతున్న రూపాయిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో కరెంట్ అకౌంట్ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి పెరిగిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గతనెలలోనే హై-ఎండ్ కన్జ్యూమర్ వస్తువులు అంటే వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషర్, ఫుట్‌వేర్, డైమాండ్స్, జెట్ ఫ్యూయల్‌పై దిగుమతి సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెంచిన దిగుమతి సుంకాలతో మరికొన్ని వస్తువులపై కూడా ధరలు పెరగనున్నాయి. ఇక నుంచి ఏయే వస్తువుల ఖరీదైనవిగా మారబోతున్నాయో ఓసారి చూద్దాం... మొబైల్ ఫోన్లు : బేస్ స్టేషన్లు, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ ఇక్విప్మెంట్, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ప్రొడక్ట్‌లు, ఐపీ రేడియోలు వంటి టెలికాం ఉత్పత్తులపై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై కూడా లెవీని పెంచింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు : ఈ రెండు వస్తువులపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వేసవికాలం అయిపోవడంతో, ఈ డ్యూటీ పెంపుతో ఎయిర్ కండీషనర్లపై అంత పెద్ద ప్రభావేమీ పడదని తెలుస్తోంది. వాషింగ్ మిషన్లు : 10 కేజీల సామర్థ్యం కంటే తక్కువ బరువున్న వాషింగ్ మిషన్లపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి ఎగిసింది. దాదాపు వాషింగ్ మిషన్ల ధరలు పెరగనున్నాయి. విమానాలు : సెప్టెంబర్27న ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈ సుంకం విధింపుతో, విమాన టిక్కెట్ల ధరలు ఖరీదైనవిగా మారబోతున్నాయి. మరోవైపు జెట్ ఫ్యూయల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీకి కాస్త ఊరట. జువెల్లరీ : జువెల్లరీ ఆర్టికల్స్‌పై కూడా దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచింది. దీంతో ఇవి కూడా ధరలు పెరగనున్నాయి. శానిటరీ వేర్ : ప్లాస్టిక్‌తో రూపొందే బాత్, షవర్ బాత్, సింక్, వాషింగ్ బేసిన్లపై కూడా దిగుమతి సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ట్రావెల్ గేర్ : ట్రంకులు, సూట్‌కేసులు, ఎగ్జిక్యూటివ్ కేసులు, బ్రీఫ్‌కేసులు, ట్రావెల్ బ్యాగులపై కూడా దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15 శాతం పెరిగింది. ప్లాస్టిక్ మెటీరియల్: బాక్సులు, కేసు, కంటైనర్లు, బాటిళ్ల డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విధమైన పెంపును టేబుల్‌వేర్, కిచెన్వేర్, ఇతర గృహోపకర ప్లాస్టిక్ వస్తువులపై కూడా పెంచింది. ఆఫీసు స్టేషనరీ, ఫర్నీచర్ ఫిట్టింగ్, డెకోరేటివ్ షీట్లు, బ్యాంగిల్స్ వంటి వాటిపై కూడా సుంకాలను కేంద్రం పెంచేసింది. -
ఇక విదేశీ స్మార్ట్ఫోన్లు కొనాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ: అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వస్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత భారం కావడం ఖాయం. గత పదిహేనురోజుల్లోనే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడం ఇది రెండవ సారి. ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 17రకాల వస్తులపై దిగుమతి పన్నును పెంచింది. వీటిల్లో స్మార్ట్‌వాచీలు,స్మార్ట్‌ఫోన్ ఎక్విప్మెంట్స్/ కంపోనెంట్స్ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA) వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇన్‌పుట్స్‌పై కూడా దిగుమతి సుంకం పెంచింది. దీంతో వీటిపై ప్రస్తుతం 10శాతంగా ఉన్న పన్ను 20 శాతానికి చేరింది. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్ వస్తువులను నిషేధిస్తూ మరో నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్టయింది. ఇటీవల 19 రకాల (ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, లెదర్ వస్తువులు, విమాన ఇంధనం తదితర)వస్తువులపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించింది. కాగా కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో కొన్ని వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధిస్తామని సెప్టెంబరులో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరగా అక్టోబర్ నాటికి డాలరు మారకంలో భారత కరెన్సీ 7 శాతం క్షీణించి రికార్డు కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్
టెలికం పరికరాల నుంచే అధిక ఈ-వేస్ట్ న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 1.03 బిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని, ఏడాదికి 25 శాతం ఈ-వ్యర్ధాల పరిమాణం పెరుగుతోందని సర్వే పేర్కొంది. దేశంలో 95 శాతం ఈ-వేస్ట్ అసంఘటిత రంగం నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావ రణ, వాతావరణ శాఖ ప్రత్యేకంగా ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను రూపోందించింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఈ- వ్యర్ధాల సేకరణ జరుగుతోందని అధ్యయనం పేర్కొంది.