జీవిత బీమా తీసుకుంటున్నారా?
ఫైనాన్షియల్ బేసిక్స్..
టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో జీవిత బీమా పాలసీ తీసుకోవడం సులభం. బీమా కంపెనీలు పలురకాల బీమా పాలసీలను అందిస్తున్నాయి. బీమా కంపెనీల వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా మన అవసరాలకు ఏ పాలసీ సరిపోతుందో మనమే ఒక అంచనాకు రావచ్చు. లేదా బీమా కంపెనీల ప్రతినిధులను కలిసి వారి ద్వారా బీమా పాలసీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత మనకు నచ్చిన పాలసీని తీసుకోవచ్చు.
ఈ విధంగా బీమా పాలసీని తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.
* ముందుగా మీ ఆర్థిక అవసరాలను గుర్తించండి. మీరు మీ కుటుంబం కోసం డబ్బుల్ని పొదుపు చేస్తున్నారా? లేదా? అనేది తెలుసుకోవాలి.
* మీ జీవిత కాలం ఆధారంగా మీ కుటుంబ సంరక్షణకు ఎంత మొత్తం అవసరమో ముందుగా ఒక అంచనాకు రండి.
* మార్కెట్లో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్ ప్లాన్ (యులిప్స్), టర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్, సంప్రదాయ/ఎండోమెంట్ ప్లాన్ అనే మూడు రకాల ప్రాడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఏ ప్రాడక్ట్ మీకు సరిపోతుందో తెలుసుకోండి.
* యూలిప్స్ అయితే రిస్క్ భరించాల్సి ఉంటుంది. అదే విధంగా అధిక రాబడి కూడా రావచ్చు.
* టర్మ్ పాలసీలో అధిక రక్షణ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
* తక్కువ రిస్క్ భరించగలమనే వారికి ఎండోమెంట్ ప్లాన్ సరిపోతుంది.
* ఫండ్ పనితీరు, ఫ్రీ-లుక్ గ్యారంటీ, సరెండర్ చార్జీల వంటి అంశాలను కూడా పరిగ ణనలోకి తీసుకోవాలి.
* ఇన్సూరెన్స్ కంపెనీ చరిత్రతో సహా క్లెయిమ్ చెల్లింపు, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో దాని ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి.