హైదరాబాద్-బహ్రెయిన్ మధ్య నేరుగా ఫ్లైట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ గల్ఫ్ ఎయిర్.. హైదరాబాద్-బహ్రెయిన్ మధ్య డెరైక్ట్ సర్వీసులను తిరిగి ప్రారంభించింది. స్థానిక కాలమానం ప్రకారం హైదరాబాద్ నుంచి బహ్రెయిన్‌కు విమానం సోమ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10:25లకు, మంగళ, శనివారాల్లో తెల్లవారుజామున 2:40లకు బయల్దేరుతుంది.
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు విమానం సోమ, శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజామున 2:55లకు, మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 2.10లకు బయల్దేరుతుంది. రెండు నగరాల మధ్య ఎయిర్‌బస్ ఏ321 విమానాలు నడవనున్నాయి. ఫాల్కన్ గోల్డ్ క్లాస్ ఫుల్ ఫ్లాట్ బెడ్ సీట్లు 8, ఎకానమీ క్లాస్‌లో 161 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం నుంచి గల్ఫ్ ఎయిర్ సర్వీసులు అందిస్తోంది.