డీఎల్‌ఎఫ్‌కు రూ.86 కోట్ల జరిమానా! | DLF, subsidiaries penalized in IPO disclosure case | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎఫ్‌కు రూ.86 కోట్ల జరిమానా!

Published Fri, Feb 27 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

డీఎల్‌ఎఫ్‌కు రూ.86 కోట్ల జరిమానా!

డీఎల్‌ఎఫ్‌కు రూ.86 కోట్ల జరిమానా!

ముంబై: మోసపూరిత, అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు గాను రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్, దాని చైర్మన్ కె.పి.సింగ్ సహా సంస్థకు చెందిన ఏడుగురిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.52 కోట్ల జరిమానా విధించింది. ఒక సంస్థపై సెబీ ఈ స్థాయి జరిమానా విధించటం ఇదే ప్రథమం. డీఎల్‌ఎఫ్‌కు చెందిన 33 సంస్థలపై మూడు సంస్థలపై ఇదే నేరానికి గాను మరో రూ.34 కోట్ల జరిమానా కూడా విధించింది.

2007లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ సంస్థ కీలకమైన సమాచారాన్ని వెల్లడించకుండా తొక్కిపట్టిందంటూ ఆ నేరానికి గాను డీఎల్‌ఎఫ్‌ను, సంస్థకు చెందిన ఆరుగురు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌లను మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గతేడాది అక్టోబర్లో నిషేధించటం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ 86 కోట్ల జరిమానా విధిస్తూ గురువారం సంస్థ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేస్తామని డీఎల్‌ఎఫ్ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement