ఆస్ట్రాజెన్‌కాతో డాక్టర్ రెడ్డీస్ న్యాయపోరాటం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా కోర్టులో ఆస్ట్రాజెన్‌కాతో న్యాయపరమైన పోరాటానికి దిగింది. నెక్సియం జెనరిక్ వెర్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ ఊదారంగులో విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆస్ట్రాజెన్‌కా అమెరికా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
దీనిపై డాక్టర్ రెడ్డీస్ కూడా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. వరుస వివాదాలతో షేరు ధర తగ్గడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ప్రమోటర్లు బహిరంగ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజాగా ప్రమోటర్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరో 21,450 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 23.37 శాతం నుంచి 23.39 శాతానికి పెరిగింది.