సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు రానున్నాయి. బడ్జెట్ అనంతరం హైఎండ్ మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాల ధరలు పెరిగే అవకాశాం ఉంది. ప్రస్తుతం ఎలాంటి సుంకాలు లేని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లేలపై రానున్న బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ విధించవచ్చని ప్రచారం సాగుతోంది. జీఎస్‌టీ రాకతో ప్రస్తుతం కేవలం కస్టమ్స్ డ్యూటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.
దేశాన్ని కేవలం ఎలక్ర్టానిక్ పరికరాల అసెంబ్లింగ్ హబ్‌లా కాకుండా తయారీ హబ్‌గా మలచాలన్న ఉద్దేశంతో ఆయా పరికరాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది జులైలో ప్రభుత్వం మొబైల్ పోన్లపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించింది. డిసెంబర్ 14న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 15 శాతానికి పెంచింది.మరోవైపు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపుతో ఆయా దేశాలతో స్వేచ్ఛా వర్తక ఒప్పందాల నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యల హేతుబద్ధతను పన్ను నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment