జోరుగా ఇ-టెయిల్ మార్కెట్ | E-tail market booming, may hit billion by 2020: Report | Sakshi
Sakshi News home page

జోరుగా ఇ-టెయిల్ మార్కెట్

Published Tue, May 5 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

జోరుగా ఇ-టెయిల్ మార్కెట్

జోరుగా ఇ-టెయిల్ మార్కెట్

ముంబై: భారత్‌లో ఆన్‌లైన్ రిటైల్‌కు సంబంధించి ఈ-టెయిల్ మార్కెట్ జోరుగా పెరుగుతోంది. భారత ఈ-కామర్స్ రంగంలో ఒక విభాగమైన ఈ-టెయిల్ మార్కెట్ 2020 కల్లా ప్రస్తుతమున్న దాని కంటే  10 రెట్లు పెరిగి 5,000 కోట్ల డాలర్లకు చేరుతుందని యూబీఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ శరవేగంగా విస్తరిస్తుండడం వంటి కారణాల వల్ల ఈ-టెయిల్ బాగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,
 
- ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)... భారత్‌లో విజయవంతమైన భారత ఈ-కామర్స్ వెంచర్‌కు ఒక మంచి ఉదాహరణ. గతేడాది ఐఆర్‌సీటీసీ మొత్తం అమ్మకాలు 300 కోట్ల డాలర్లను మించాయి. భారత వినియోగదారులు టెక్నాలజీని ఆమోదించడానికి సిద్ధంగానే ఉన్నారన్న విషయాన్ని ఐఆర్‌సీటీసీ విజయం వెల్లడిస్తోంది.
- భారత్‌లో ఈ కామర్స్‌ది బలుపు కాదు వాపు అనే భావన సరైనది కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement