న్యూఢిల్లీ: హోమ్ రెంటల్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫార్మ్ ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్‌ను ఎలార టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కొనుగోలుతో తాము ఆన్‌లైన్–టు–ఆఫ్‌లైన్ హోమ్ రెంటల్స్ విభాగంలో(ఈ మార్కెట్ సైజు రూ.20,000 కోట్లుగా ఉంటుందని అంచనా)కి ప్రవేశించినట్లయిందని సింగపూర్‌కు చెందిన ఎలార టెక్నాలజీస్ తెలిపింది. ఈ ఈలావాదేవీ విలువ రూ.100 కోట్లు. భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన మూడు రియల్టీ పోర్టళ్లు–హౌసింగ్‌డాట్‌కామ్, ప్రాప్ టైగర్, మకాన్‌లను కూడా ఎలార టెక్నాలజీస్ సంస్థే నిర్వహిస్తోంది. ఇక ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్ సంస్థ, ఆన్‌లైన్–టు–ఆఫ్‌లైన్ బ్రోకరేజ్ సంస్థగా గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
జీడీపీ చేతికి గేట్‌వే రైల్ డీల్.. రూ.850 కోట్లు
ముంబై: గేట్‌వేఫ్రైయిట్(గేట్‌వే రైల్)లో పూర్తి వాటా కొనుగోలు లావాదేవీని ను గేట్‌వే డిస్ట్రిపార్క్స్(జీడీపీ) పూర్తి చేసింది. గేట్‌వేఫ్రైయిట్‌లో బ్లాక్‌స్టోన్‌కు ఉన్న పూర్తి వాటాను రూ.850 కోట్లకు కొనుగోలు చేశామని గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వెల్లడించింది. గేట్‌వే రైల్ టేకోవర్‌తో దేశవ్యాప్తంగా తమ రవాణా సేవలు మరింతగా విస్తరించాయని జీడీఎల్ సీఎమ్‌డీ ప్రేమ్ కిషన్ గుప్తా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్ షేర్ ధర 6.5 శాతం లాభంతో రూ.141 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment