Rentals
-
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్‌లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్‌లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్‌పూర్‌లోని హోటల్ లీలా ప్యాలెస్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్‌కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్‌లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్‌సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్‌పూర్‌లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్‌కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. ‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు. అద్దెల పెంపు 3–4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్‌లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్‌లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్‌లో 60 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది. -
అద్దెదారులకు షాక్: కొత్త జీఎస్టీ గురించి తెలుసా?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇకపై అద్దెదారులకు భారీ షాక తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 ఎవరు జీఎస్టీ చెల్లించాలి? అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను చెల్లించాలి. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు GST లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST ఉండదు అని స్పష్టం చేసింది. ఇది చదవండి : Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ మింట్ అందించిన కథనం ప్రకారం జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 18 నుంచి దేశంలో కొత్త జీఎస్టీ పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దె చెల్లిస్తున్న దానిపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, అద్దెదారు లేదా భూస్వామి నమోదు చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జూలై 17, 2022 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెను జీఎస్టీ నుంచి మినహాయించిన సంగతి తెలిసిదే. కానీ ఈ ఏడాది జూలై 18 నుండి, నమోదు చేసుకున్న అద్దెదారు అద్దె ఆదాయంపై 18 శాతం పన్ను చెల్లించాలి. దీనిపై స్పందించిన క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా సాధారణ జీతం పొందే వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లయితే, వారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు, గృహ యజమానుల, నమోదిత వ్యక్తి యజమానికి చెల్లించే అద్దెపై తప్పనిసరిగా 18 శాతం GST చెల్లించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ ఎంటిటీ, లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో వ్యాపారులకు ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి : ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై..చిక్కుల్లో ఉద్యోగులు!
కరోనా ముందు కాలం వచ్చేసింది. కేసులు, మరణాలు,మాస్కులు, భౌతిక దూరాలు, శానిటైజర్లు వంటి వన్ని రోజూవారి జీవనం నుంచి తొలగి పోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2022వ సంత్సరం 2019 సంవత్సరంలా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగల్ని ఆఫీస్‌లకు ఆహ్వానిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్ బై చెప్పి కార్యాలయాలకు తిరిగి వస్తున్న ఉద్యోగులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులు ఊర్లలో ఉన్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌కు రావడంతో..యజమానులు ఇంటి అద్దెల్ని భారీగా పెంచుతున్నారు. దీంతో ఉద్యోగులు సగం జీతాన్ని ఇంటి అద్దెకే చెల్లిస్తుండడంతో పడరాని పాట్లు పడుతున్నారు. మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత కొన్ని నెలలకు చేరింది. ఏకంగా 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెండేళ్ల తర్వాత దేశమంతా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. సంస్థల ఆదేశాలతో తిరిగి ఆఫీస్‌లకు వెళ్లేందుకు ఉద్యోగులు సొంత గ్రామాల నుంచి నగరానికి వస్తున్నారు. అలా రాజధాని ఐటీ ఏరియాల్లో నివసించే ఉద్యోగులకు ఇంటి అద్దె కట్టే విషయంలో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ గచ్చిబౌలి ప్రాంతాల్లో యజమానులు ఇంటి రెంట్లను పెంచడంతో..సగం జీతం ఇంటి అద్దెకే వెళుతుందని వాపోతున్నారు. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు 6నుంచి 8శాతం పెరిగింది. పలు నివేదిక ప్రకారం..ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఆరు,ఎనిమిది నెలల క్రితం 2బీహెచ్‌కే అద్దె రూ.25వేల నుంచి రూ.28వేలు' ఉండేది. కానీ ఇప్పుడు రూ.30 వేలు,రూ.32వేలకు పైగా ఉందని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ నెల గచ్చీబౌలీ ఏరియాలో ఇంటి అద్దె రూ.35వేలుంటే..ఈ ఏడాది మార్చి నెల సమయానికి రూ.45వేలకు చేరినట్లు హౌస్ రెంటల్ ఏజెన్సీలు చెబుతుండగా..వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు ఉద్యోగులు వస్తున్నారని, అందుకే యజమానులు ఇంటి రెంట్లను భారీగా పెంచుతున్నట్లు అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. చదవండి: ప్రమోషన్లు వద్దంటున్న ఉద్యోగులు ! కారణం తెలిస్తే షాకవుతారు? -
Shopping Mall: షాపింగ్ మాల్స్ ఢమాల్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్స్ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్‌లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్ యజమానులు సాధారణంగా లీజ్ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్డౌన్ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్ వేవ్‌లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్ గ్రూప్ ఈడీ అభిషేక్ బన్సల్ తెలిపారు. రెంటల్ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్ డైరెక్టర్ హర్‡్ష బన్సల్ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్మన్, వేక్ఫీల్డ్ చెబుతోంది. ఇతర ఆదాయాలూ తగ్గాయి.. మొత్తం రెంటల్ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్–అప్ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్ ఇండియా డైరెక్టర్ హర్షవర్ధన్ సింగ్ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్ పుంజుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముప్పులా పరిణమించిందని చెప్పారు. -
అద్దె ఇల్లు ఖాళీ చేయించడానికి ఖతర్నాక్ ప్లాన్
కర్ణాటక,దొడ్డబళ్లాపురం: ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించడానికి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తికి ఉపాయం కాస్త బెడిసికొట్టి అతడే జైలుపాలైన సంఘటన రామనగరలో చోటుచేసుకుంది. రామనగరలోని ఎక్స్టెన్షన్ కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ ఇక్బాల్ (76) అరెస్ట్ కాగా ఇతడి అల్లుడు పర్వేజ్ (35) పరారీలో ఉన్నాడు. వివరాలు... ఇక్బాల్ సోదరుడు జాకీర్ విదేశాల్లో ఉంటున్నాడు. రామనగరలోని ఎక్స్టెన్షన్ కాలనీలో జాకీర్‌కు ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన ఇక్బాల్ అద్దె ఉంటున్న యువకులను ఖాళీ చేయించడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. గత కొన్ని నెలలుగా పలుసార్లు అటవీశాఖ అధికారులను కలిసి తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులు వన్యప్రాణుల మాంసం తెచ్చుకుంటున్నారని, సమాచారమిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు రోజులక్రితం ఇక్బాల్ తన అల్లుడు పర్వేజ్‌తో కలిసి నెమలి మాంసం, జింక మాంసం, తీసుకువచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. అధికారులు యువకులను విచారించి విషయం తెలుసు కున్నారు. అసలు సంగతి వెలుగు చూడడంతో పర్వేజ్ పరారయ్యాడు. అటవీశాఖ అధికారులు ఇక్బాల్‌ను అరెస్టు చేశారు. -
ఎలార టెక్నాలజీస్ చేతికి ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్
న్యూఢిల్లీ: హోమ్ రెంటల్ బ్రోకరేజ్ ప్లాట్ఫార్మ్ ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్‌ను ఎలార టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కొనుగోలుతో తాము ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ హోమ్ రెంటల్స్ విభాగంలో(ఈ మార్కెట్ సైజు రూ.20,000 కోట్లుగా ఉంటుందని అంచనా)కి ప్రవేశించినట్లయిందని సింగపూర్‌కు చెందిన ఎలార టెక్నాలజీస్ తెలిపింది. ఈ ఈలావాదేవీ విలువ రూ.100 కోట్లు. భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన మూడు రియల్టీ పోర్టళ్లు–హౌసింగ్‌డాట్‌కామ్, ప్రాప్ టైగర్, మకాన్లను కూడా ఎలార టెక్నాలజీస్ సంస్థే నిర్వహిస్తోంది. ఇక ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్ సంస్థ, ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ బ్రోకరేజ్ సంస్థగా గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జీడీపీ చేతికి గేట్‌వే రైల్ డీల్.. రూ.850 కోట్లు ముంబై: గేట్వేఫ్రైయిట్(గేట్‌వే రైల్)లో పూర్తి వాటా కొనుగోలు లావాదేవీని ను గేట్‌వే డిస్ట్రిపార్క్స్(జీడీపీ) పూర్తి చేసింది. గేట్వేఫ్రైయిట్లో బ్లాక్‌స్టోన్‌కు ఉన్న పూర్తి వాటాను రూ.850 కోట్లకు కొనుగోలు చేశామని గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వెల్లడించింది. గేట్‌వే రైల్ టేకోవర్‌తో దేశవ్యాప్తంగా తమ రవాణా సేవలు మరింతగా విస్తరించాయని జీడీఎల్ సీఎమ్‌డీ ప్రేమ్ కిషన్ గుప్తా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్ షేర్ ధర 6.5 శాతం లాభంతో రూ.141 వద్ద ముగిసింది. -
కార్యాలయాలకే గిరాకీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2018 తొలి త్రైమాసికంలో కార్యాలయాల స్థిరాస్తి మార్కెట్‌కు ఊపొచ్చింది. సప్లయి తక్కువగా ఉండటం... డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఐటీ కారిడార్లకు గిరాకీ పెరిగింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ రియల్టీ మార్కెట్లో టెక్ కంపెనీలు ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ సంస్థల లావాదేవీలు ఎక్కువగా జరిగాయని దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా నివేదిక తెలిపింది. నగరంలో డిమాండ్ పెరగడంతో మైక్రో మార్కెట్లలో అద్దె ధరలు పెరిగాయి. 2018 జనవరి–మార్చి మధ్య తొలి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన మార్కెట్లలో 11 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను అద్దెకిచ్చారు. 2017 క్యూ1తో పోలిస్తే ఇది 25 శాతం వృద్ధి. స్థలాలను అద్దెకు తీసుకున్న వాటిల్లో 25 శాతం టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 24 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 15 శాతం ఉన్నాయి. ఎక్కువ లావాదేవీలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా జరిగాయి. క్యూ1లో దేశంలో అత్యధిక ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు నిలిచింది. బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్ సంస్థలు ఎక్కువ లావాదేవీలు జరిపాయి. అద్దెలూ పెరిగాయి. హైదరాబాద్‌లో 3–12 శాతం పెరిగిన అద్దెలు.. 2018 తొలి త్రైమాసికంలో బేగంపేట్, రాజ్‌భవన్ రోడ్, బంజారాహిల్స్ 1, 2, 19, 12 రోడ్ల్లలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో 3–5 శాతం అద్దెలు పెరిగాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లలో సప్లయి పరిమితంగా ఉండటంతో అద్దెలు 8–12 శాతం పెరిగాయి. నానక్‌రాంగూడ, రాయదుర్గం, మణికొండ, కూకట్‌పల్లిల్లో కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపించడంతో అద్దెలు 6–18 శాతం మేర పెరిగాయి. కనెక్టివిటీ కలిసొచ్చింది..: నైపుణ్యమున్న యువత, అందుబాటు ధరలు, అద్దెలు, మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో మెరుగైన కనెక్టివిటీలతో ప్రస్తుతం నగరంలో ఉన్న కార్పొరేట్ సంస్థలతో పాటూ కొత్త కంపెనీల ఆకర్షణలో ప్రధానంగా మారాయని సీబీఆర్ఈ సౌత్ ఏషియా డైరెక్టర్ రోమిల్ దూబే తెలిపారు. -
అద్దె ఇల్లు... బతికినంత వరకే...
తల్లీదండ్రీ లేరు. ఉన్న ఒక్కగానొక్క అన్న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆస్పత్రి మార్చురీలో శవం. అద్దె ఇంటికి మృతదేహాన్ని తేవద్దని ఇంటి యజమాని షరతు. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో చెల్లెలు బోరున విలపించింది. మంగళవారం తిరుపతిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా రెండు వారాల కిందట నగరంలో పేరున్న ఓ జర్నలిస్టు భార్య అనారోగ్యంతో అకస్మాత్తుగా కన్నుమూసింది. అద్దె ఇంట్లోకి వద్దని ఆ ఇంటి యజమాని పట్టుబట్టారు. చేసేది లేక బయటే అంత్యక్రియలు జరిపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : పైన చెప్పినవి ఏ ఒక్కరి సమస్యో కాదు. నగరంలో అద్దెకుండే కుటుంబాలందరిదీ. బతికున్నంత వరకూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే ఇళ్ల యజమానులు ప్రాణం పోయాక శవాలను దూరం పెడుతున్నారు. ఈ దురాచార సంస్కృతి తిరుపతిలో మళ్లీ వేళ్లూనుకుంటోంది. రాను రాను మంచితనం, మానవత్వం మాయమవుతున్నాయి. అద్దె ఇళ్లలో 80 వేల కుటుంబాలు... శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో లక్షా పది వేలకు పైగా ఇళ్లున్నాయి. ఇందులో 80 వేలకు పైగా కుటుంబాలు అద్దెకుంటున్నాయి. పిల్లల చదువుల కోసమనో, వ్యాపారాల కోసమనో పల్లెల నుంచి నగరానికి వచ్చి స్థిరపడ్డ వారే ఎక్కువ. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, తమళనాడు, బెంగళూర్ ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చనిపోతే శవం బయటే... అద్దెకుండే కుటుంబాల్లో కొంత మంది ఇంట్లోనే అనా రోగ్యంతో చనిపోతారు. మరికొంత మంది బయట రోడ్డు ప్రమాదాల్లో కన్ను మూస్తారు. ఇంకొంత మంది చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లో చనిపోతుంటారు. ప్రాణం ఎక్కడ పోయినా పలువురు ఇళ్ల యజమానులు మాత్రం శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. బయటి వ్యక్తుల ప్రాణం ఇంట్లో పోతే అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి ఉంటుందన్న మూఢ నమ్మకాలను పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం నాగరికతను మర్చిపోయి పాత తరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనిషి దూరమైన బాధతో కన్నీరు మున్నీరయ్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్దయగా చెప్పడం ఎంత వరకూ న్యాయమో ఆలోచించడం లేదు. ఈ విషయంలో మార్పు రావాల్సి ఉంది. చట్టాన్ని అతిక్రమించడమే... ఇంటి యజమాని ప్రతి నెలా అద్దె వసూలు చేసుకుంటారు. అద్దెకుండే ఇంట్లో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలుంటే తానూ పాల్గొంటాడు. అదే మనిషి కన్నుమూస్తే మాత్రం అటు వైపు చూడరు సరికదా...ఒక్కసారిగా భయం, సెంటిమెంట్ గుర్తొస్తుంది. ఇంట్లోకి మృతదేహం వద్దని చెప్పడమే కాకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఘనులూ ఉన్నారు. అయితే చట్టం దీన్ని ఒప్పుకోదు. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛను కల్పించారో, చనిపోయాక కూడా అదే స్వేచ్ఛను కల్పించాలని ఏపీ బిల్డింగ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్టు 1960 చెబుతోంది. ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్న నేపథ్యంలో ఇంటి యజమానులు ఎలాంటి హక్కుల్ని కలిగి ఉంటారో, స్వేచ్ఛాయుత జీవనానికి సరిపడ హక్కుల్ని అద్దెదారులూ కలిగి ఉంటారన్నది విస్మరిస్తున్నారు. ఇది చాలా అమానుషం ... అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. తిరుపతిలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది యజమానులు సామాజిక బా ధ్యతను మర్చిపోతున్నారు. మానవీయ దృక్ఫథాన్ని మర్చిపోతున్నారు. మనుషుల్లో మార్పు రావాలి. గంగవరపు శ్రీదేవి, రచయిత్రి మనుషులు మారాలి... అద్దె ఇళ్లలో ఉండే వారు చనిపోతే ఇంటి యజమానులు శవాన్ని నిరాకరించడం దారుణం. బంధువు చనిపోయి బాధల్లో ఉన్నవారికి మరింత క్షోభను మిగిల్చే అంశమిది. మానవీయ దృక్పథంతో మనుషులు మారాలి. మంచితనాన్ని పది మందికీ పంచాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మేధావులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి డైరెక్టర్, తిరుపతి -
మూతపడ్డ మున్సిపల్ దుకాణాలు
* మున్సిపాలిటికీ భారీగా నష్టం * అద్దెలను పెంచడంతోనే సమస్య తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండులో మున్సిపాలిటీకి చెందిన షాపులకు అద్దెలను విపరీతంగా పెంచారు. దీంతో సంవత్సరం నుంచి దుకాణాలు మూతపడి నగర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. తిరువళ్లూరు మున్సిపాలిటీకి బస్టాండులో 36 షాపులు ఉన్నాయి. వీటిలో 20 సంవత్సరాల నుంచి పండ్లు, పూల వ్యాపారులు, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ షాపులను నిర్వహించే వారు. అప్పట్లో ఒక్కో దుకాణానికి రెండు వేలు నుంచి మూడు వేల రూపాయల వరకు చెల్లించేవారు. దీంతో ప్రతి నెలా ఎంతో కొంత ఆదాయం ము న్సిపాలిటీకి వచ్చేది. అయితే నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శరవణకుమార్ అప్పట్లో నిబంధనలను మార్చి ఓపెన్ టెండర్ ద్వారా అద్దెలను నిర్ణయించారు. ఒక్కో షాపు అద్దె మూడు వే ల రూపాయల నుంచి 40 వేల రూపాయలకు పెరగడంతో వ్యాపారులు అద్దె కు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది నుండి 36 షాపులు మూతపడడంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడింది. షాపులు సైతం మూతపడడంతో వ్యాపారులు బస్టాండులో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా షాపులను ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూత పడిన షాపులకు రీటెండర్ నిర్వహించి వ్యాపారులకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
ఇళ్ల అద్దెలూ ఆకాశానికి
► రాజధాని ప్రచారంతో రెట్టింపైన ఇళ్ల అద్దెలు ► విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో జోరుగా అద్దెల వ్యాపారం ► అద్దె పెంచేందుకు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న యజమానులు ► ఏదో ఒకసాకుతో ఖాళీ చేయించడం, లేకుంటే అవస్థలు పెట్టడం ► ఇంటి యజమాని,కిరాయిదారుల మధ్య పెరుగుతున్న వివాదాలు విజయవాడ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కొత్త రాజధాని ప్రచారం అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో రెండు నెలలుగా ఇళ్ల అద్దెలు మెట్రో నగరాలతో పోటీ పడుతున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరే ఇప్పుడు రెంటల్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నుంచి రాష్ర్ట మంత్రుల వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు పెడితే చంద్రబాబు బస చేసేందుకు గురునానక్ కాలనీలో ఒక ఇంటిని ఇటీవల పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే క్యాంపు ఆఫీసు పెట్టారు. జిల్లాలోని మరో ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలు క్యాంపు ఆఫీసుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా విజయవాడలో ఇంటి వేటలోపడ్డారు. దీనికి తోడు కొన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడ, గుంటూరు నగరాలకు క్యూ కడుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులు విపరీతంగా ఇంటి అద్దెలు పెంచేశారు. రెండు నెలల్లోనే అద్దెల భారం పెరగడంతో మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ సంపాదనలో సగం అద్దె కట్టడానికే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు.విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న విజయవాడ. ఇప్పుడు రాజధానికి చేరువ కాబోతోందన్న ప్రచారంతో సత్యనారాయణపురం, వన్‌టౌన్, గవర్నర్‌పేట ప్రాంతాల్లో అద్దెలు రెట్టింపయ్యాయి. గతంలో పదివేలు పలికిన అపార్ట్మెంట్ ప్లాట్ అద్దె కొన్ని చోట్ల ఏకంగా రూ.20 వేల దాకా పెరిగింది. నగర శివారు కానూరు, పోరంకి, యనమలకుదురు, రామవరప్పాడు, సింగ్ నగర్, భవానీపురంలో గతంలో రూ.3వేలు నుంచి ఐదు వేలున్న ఇంటి అద్దె ఇప్పుడు రూ 8 నుంచి రూ .10 వేలకు చేరింది. 1.విజయవాడలో సుమారు మూడు లక్షల ఇళ్లు ఉండగా నాలుగున్నర లక్షలకుపైగా కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకు త్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.12 నుంచి 25వేలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.10 నుంచి 15వేలు, సింగిల్ పోర్షన్ రూ.4 నుంచి 8వేల అద్దెలు ఉన్నాయి. 2. గుంటూరులో గత మూడు నెలలతో పోల్చితే ఇప్పుడు 30శాతం వరకు అద్దెలు పెరిగాయి. నగరంలో 1.83లక్షల ఇళ్లు ఉంటే7.60లక్షల జనాభా ఉంది. టూ టౌన్ ప్రాంతంలో రెండు పడక గదుల ప్లాట్ రూ.10వేల నుంచి 15వేలకు అద్దె పలుకుతోంది. గుంటూరు తూర్పు ప్రాంతంలో ఇంటి అద్దె రూ.6వేల నుంచి 8వేల వరకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.8వేల నుంచి 10వేల వరకు ఉంది. 3. రాజధాని ప్రచారంతో మంగళగిరిలో సైతం అద్దె ఇళ్లకు డిమాండ్ రావడంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ ఆసుపత్రి, హాయ్‌ల్యాండ్, కొకొకోలా వంటి వాటితో ఇక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో 18వేల ఇళ్లు ఉండగా సుమారు 30 వేల కుటుంబాలు ఉంటున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ అద్దెలు 25 నుంచి 35శాతం పెరిగాయి. ఇల్లు ఖాళీ చేస్తే అద్దెకు మరో ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో రూ.5వేలు ఉన్న ప్లాట్ ఇప్పుడు రూ.8 నుంచి 9వేలకు పెరిగింది.