పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్‌ఏఎస్) దాదాపు ఆరేళ్ల తర్వాత తొలి ఈక్విటీ స్కీమ్‌ను ప్రారంభించనుంది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ పేరిట దీన్ని జూలై మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ నీల్ పరాగ్ పారిఖ్ వెల్లడించారు. తమ ఫండ్ హౌస్ నుంచి ఇది మూడో స్కీమ్ అవుతుందని, ఈక్విటీలకు సంబంధించి రెండోదని వివరించారు. ‘గత కొన్నేళ్లుగా ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్ ప్రారంభించాలంటూ చాలా మంది కోరుతున్నారు. అయితే, తగినంత సంఖ్యలో ఇన్వెస్టర్లు పోగయ్యేవరకు వేచి చూడాలని భావించాం’ అని తెలిపారు. పీపీఎఫ్‌ఏఎస్ ఇప్పటి దాకా కేవలం ఒకటే ఈక్విటీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పేరిట నిర్వహిస్తున్న ఈ స్కీము మల్టీ–క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇటు భారత్‌లోనూ అటు విదేశీ స్టాక్స్‌లోనూ దీని ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉందని తెలిపారు. మరోవైపు ఈక్విటీ స్కీమ్‌లోకి సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ సదుపాయం కల్పించేందుకు 2018 మే లో పరాగ్ పారిఖ్ లిక్విడ్ ఫండ్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెల్ప్ ఇన్వెస్ట్ పేరిట మొబైల్, వెబ్ యాప్‌లూ అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment