సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, వాతావరణ మార్పులే రాబోయే రోజుల్లో భారత్ ముందున్న అతిపెద్ద సవాళ్లని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త జోసెఫ్ స్టిలిట్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ నిరంతర వృద్ధి పరంపర కొనసాగిస్తూ పటిష్ట ఆర్థిక శక్తిగా ఎదిగినా ఉపాధి కల్పన మాత్రం పెను సమస్యగా పరిణమించిందన్నారు. నగర ప్రాంతంలో ఉద్యోగాలు కొంతమేర అందుబాటులోకి వచ్చినా ఇతర ప్రాంతాల్లో ఈ సవాల్‌ను అధిగమించడం సంక్లిష్టమని అన్నారు.
వ్యవసాయంలో భారత్ పర్యావరణ హితమైన పద్ధతులను అనుసరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఇది విఘాతంగా పరిణమిస్తుందని అన్నారు. ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాగా ట్రంప్ విధానాల ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని, అమెరికన్ సంస్థలను ఆయన విస్మరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ట్రంప్ చెబుతున్న ట్రేడ్ వార్‌కు అమెరికన్ చట్టాలు అనుమతించవని స్టిలిట్జ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment