ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఫండ్ మేనేజర్లుగా యూటీఐ ఏఎంసీ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఎంపికయ్యాయి. మూడేళ్ల కాలానికి వీటిని నియమిస్తూ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన రూ. 700 కోట్ల మొత్తాన్ని కాలావధికి ముందుగానే ఉపసంహరించుకునే ప్రతిపాదనకు కూడా ఈపీఎఫ్‌వో ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment