న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు అయిన రుయాలు గతంలో ఏజిస్ అమెరికా కార్యకలాపాలను రూ.4,200 కోట్లకు, ఏజిస్‌ను రూ.2,000 కోట్లకు, ఎస్సార్ ఆయిల్‌ను రూ.72,000 కోట్లకు, ఈక్వినాక్స్‌ను రూ.2,400 కోట్లకు విక్రయించడం ద్వారా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకున్న విషయం గమనార్హం. ఇప్పుడు ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలు రూ.54,389 కోట్లను తీర్చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తే మొ త్తం రుణ భారం రూ.1.25 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నట్టు అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment