Mittal
-
మస్క్ వైపే కేంద్రం మొగ్గు..
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కోరుతున్నాయి. -
బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మరో కీలక అడుగు వేసింది. కరోనా విస్తరణ, సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక ఈ లేఖ రాసింది. చైనా వస్తువులను ఉపయోగించడం మానుకోవాలంటూ అంబానీ, టాటా, గోద్రేజ్, ప్రేమ్‌జీ, మిట్టల్‌కు తదితర 50 మంది దిగ్గజాలనుద్దేశించి సీఏఐటీ ఈ లేఖ రాసింది. భారత ప్రజలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, భారతీయ పరిశ్రమ కెప్టెన్లలో ఒకరిగా భావిస్తారనీ తామూ అదే నమ్ముతున్నామని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ సామూహిక ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది భారతదేశాన్ని 'స్వయం ఆధారిత భారత్' గా మార్చడానికి దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. ఈ లేఖను పంపిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాబితాలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అజీం ప్రేమ్ జీ, కుమారం మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, విక్రమ్ కిర్లోస్కర్, సునీల్ భారతి మిట్టల్, రాహుల్ బజాజ్, శివ్ నాదర్, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్ కోటక్, నుస్లీ వాడియా, శశి మధుకర్ పరేఖ్, హర్ష్ మారివాలా, డాక్టర్ సతీష్ రెడ్డి, పంకజ్ పటేల్ , నీలేష్ గుప్తా తదితరులు ఉన్నారు. కాగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి వంటి వ్యాపారాలు చైనా దిగుమతులు, ప్రధానంగా విడిభాగాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి, దీంతో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు మారుతి, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులను తగ్గించడం రాత్రికి రాత్రికి సాధ్యం కాదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. గత 15 సంవత్సరాలకు పైగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడులు పెట్టాం. చాలా విశ్వసనీయమైన, స్నేహితులున్నారు. అకస్మాత్తుగా నిలిపివేయాలంటే ఎలా అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. ఒక సంస్థగా, దేశంగా ఇది ఎంత వరకు సబబో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మరోవైపు రాబోయే 3 సంవత్సరాల్లో ఆటోమోటివ్ రంగంలో విడి భాగాల దిగుమతులు, ఇతర సాధనాలపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించడం సాధ్యమని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. చైనాలోని వ్యూహాన్ నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, సరిహద్దు వెంబడి చైనా దుశ్చర్య కారణంగా గాల్వన్ ప్రావిన్స్‌లో 20 మంది సైనికుల మరణం తరువాత చైనా బహిష్కరణ ప్రచారాన్ని సీఏఐటీ ఉధృతం చేసింది. దాదాపు 500 ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. 2021 డిసెంబర్ నాటికి 100,000 కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) రూపాయల దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20లో చైనా నుండి 65.26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంది. 2019-20లో 81.86 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఇండియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
ఎస్సార్స్టీల్ ఇక ఆర్సెలర్ మిట్టల్‌దే!
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల అత్యధిక బిడ్డింగ్‌పై ఈ నెల 11వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌ఏటీ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే దీనిని 28 మంది ఆపరేషనల్ క్రెడిటార్స్ వ్యతిరేకించారు. ఎస్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వుకు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్సీఎల్టీ తమ వాదనలు అందరివీ వేర్వేరుగా రోజూవారీ వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. అందరూ కలిసి ఒకే రిప్రజెంటేషన్ సమర్పించాలని ఎన్సీఎల్టీ ఆదేశించడం సరికాదని స్పష్టంచేశాయి. అయితే ఆపరేషనల్ క్రెడిటార్స్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ, వారి ద్వారా ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లే దివాలా పక్రియను అడ్డుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికే 571 రోజులు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎన్సీఎల్ఏటీపై ఇక దృష్టి... కాగా ఆర్సెలర్ మిట్టల్ బిడ్డింగ్‌పై 11వ తేదీలోపు ఎన్సీఎల్టీ తుది నిర్ణయం ఇవ్వాలని లేదంటే 12వ తేదీన తానే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్సీఎల్ఏటీ గతంలో రూలింగ్ ఇచ్చింది. ఈ గడువు తీరడంతో ఇప్పుడు ఎన్సీఎల్ఏటీ చర్యలపై ఆసక్తి నెలకొంది. -
కెరీర్ లక్ష్యంగా విద్యాబోధన
ఈ రోజుల్లో విద్య వ్యాపారమే. ఎవరూ కాదనలేని సత్యం ఇది. ధనార్జనే ధ్యేయంగా సంస్థలు నడిపేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క మినహాయింపుగా కనిపిస్తుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు జలంధర్ సమీపంలోని 600 ఎకరాల క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తుండటమూ.. ప్రైవేట్ యూనివర్సిటీగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చేపట్టడమూ.. వర్సిటీ రూటు సపరేటు అనేందుకు తార్కాణాలు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో యూనివర్సిటీ కులపతి అశోక్ మిట్టల్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ఎల్పీయూలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 20 శాతం వరకూ ఉన్నారు కదా.. మరింత మందిని ఆకర్షించేందుకు దక్షిణాదిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు కదా? జవాబు: ప్రపంచం మొత్తమ్మీద ఏ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయానికీ రెండో క్యాంపస్ లేదు. దక్షిణాదిలో ఇంకో క్యాంపస్ పెడితే. ఈ క్యాంపస్ మానవ వనరులను పంచుకోవాల్సి వస్తుంది. ఇది నాణ్యతతో రాజీపడటమే. నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే అంత దూరం నుంచి విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి రెండో క్యాంపస్ ఎందుకు? ప్ర: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. మరి.. ఇంతమంది విద్యార్థుల కారణంగా బోధన నాణ్యత దెబ్బతింటుంది కదా..? జ: విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాణ్యతకు ఏమాత్రం సమస్య కాదు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలకు వేల ఎకరాల భూమి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువ. ఇది పరోక్షంగా పన్ను డబ్బులను వృథా చేయడమే. అక్కడ ఫీజులు తక్కువగానే ఉన్నా వనరుల దుర్వినియోగం అవుతున్న మాటేమిటి? ఎల్పీయూలో కరిక్యులం రూపకల్పన మొదలు.. పరీక్షల నిర్వహణ వరకూ అన్నింటినీ స్వతంత్ర వ్యవస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అధ్యాపకుల బోధనకు సంబంధించి ప్రతీ క్లాస్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరుగుతుంది. దీనిపై తరచూ సమీక్ష జరిపి వారి లోటుపాట్లను సరిదిద్దే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ అదనంగా బయటి సంస్థల నిపుణులు మా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం కూడా. ప్ర: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. మీ దృష్టిలో దీనికి కారణాలేమిటి? జ: అవి మా కంటే ముందుగా ఏర్పాటైన సంస్థలు. అంటే మాకు అన్నల్లాంటి వారు. లోపాలు ఉండవచ్చుగానీ.. ఆ తప్పులు ఎంచేందుకు నాకు ఏ హక్కూ లేదు. మాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా. వాటిని గుర్తుంచుకుని దిద్దుకోవడం మేం చేయగలిగిన పని. అదే పని అక్కడ కూడా జరుగుతోందని అనుకుంటున్నాం. ప్ర: విద్యావిధానం విషయంలో ఎల్పీయూ ప్రత్యేకత ఏమిటి? జ: మిగతా విద్యాసంస్థల్లో ముందు చదువు చెబు తారు. డిగ్రీ ఇస్తారు. విద్యార్థులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎల్పీయూ ప్రణాళిక దీనికి పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాల అధ్యయనం తర్వాత వాటికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా కరికులం రూపొందిస్తాం. కోర్సు సాగినన్ని రోజులు విద్యార్థులు తమ ఇష్టాఇష్టాలకు తగిన ఉద్యోగాన్ని సంపాదించు కునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణకు అవకాశాలు కల్పిస్తాం. తొలి ఏడాదిలో అవకాశాల గురించి వివరిస్తే.. రెండో ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాలను చెబుతాం. అవసరమైతే విద్యార్థి తన మునుపటి ఆప్షన్‌ను సరిచేసుకునేందుకూ వీలుంటుంది. ఈ ప్రణాళిక కారణంగానే ఎల్పీయూ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు 70–80 శాతం వరకూ ఉన్నాయి. జాగ్రఫీ డిగ్రీ చేసిన వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ప్ర: ఎల్పీయూలో 200 కోర్సుల వరకూ ఉన్నాయి. వీటి ఫీజుల గురించి చెబుతారా? జ: సగటున ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు ఏడాదికి సగటున రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఈ వర్సిటీ రూటు సపరేటు అనేందుకు ఒక నిదర్శనం. హాస్టల్ ఫీజు రూ.50 వేల నుంచి మొదలవుతుంది. దేశంలోని ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులతో పోల్చినా ఇది 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ. ఎల్పీయూ నెస్ట్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన వారికి స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నాం. ప్ర: ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు ఉండటం చాలా అరుదు? జ: నిజమే. అయితే మానవ వికాసంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు చాలా కీలకమనేది మా నమ్మకం. పైగా విద్య ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో మేము బీఏ, బీకామ్‌లతోపాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సులూ ప్రవేశపెట్టాం. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలుసుకోవడం అవసరమవుతుంది. ప్ర: ఎల్పీయూలో వైద్య విద్య కోర్సు లేకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? జ: కొన్నేళ్ల క్రితం ఈ కోర్సు కోసం ప్రయత్నించాం. అయితే బోలెడన్ని అనుమతులు, నిబంధనలు ఉన్నాయి. పైగా అక్కడ వ్యవస్థ పనితీరు కూడా అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మా ఆలోచన విరమించుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం. ప్ర: లవ్లీ మిఠాయి దుకాణం ద్వారా మీ ప్రస్థానం మొదలైంది. విద్యారంగం వైపు మళ్లేందుకు కారణాలు? జ: మిఠాయిల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించాం. సమాజానికి ఎంతో కొంతతిరిగి ఇచ్చేయాలని అనుకున్నాం. ఆస్పత్రులు కట్టడం మొదలుకొని వృద్ధాశ్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే బాగా రాణిస్తున్న నేపథ్యంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావించి ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించాం. సమాజ అభివృద్ధికి దోహదపడే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ఎస్సార్ స్టీల్‌పై ఎస్సార్ గ్రూపు న్యాయపోరాటం?
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు అయిన రుయాలు గతంలో ఏజిస్ అమెరికా కార్యకలాపాలను రూ.4,200 కోట్లకు, ఏజిస్ను రూ.2,000 కోట్లకు, ఎస్సార్ ఆయిల్‌ను రూ.72,000 కోట్లకు, ఈక్వినాక్స్‌ను రూ.2,400 కోట్లకు విక్రయించడం ద్వారా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకున్న విషయం గమనార్హం. ఇప్పుడు ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలు రూ.54,389 కోట్లను తీర్చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తే మొ త్తం రుణ భారం రూ.1.25 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నట్టు అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్‌ను ఎట్టకేలకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ దక్కించుకుంది. దీంతో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి ఆర్సెలర్ మిట్టల్‌కు అవకాశం లభించినట్లయింది. ఈ డీల్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు ఎస్సార్ స్టీల్ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్సెలర్ మిట్టల్ శుక్రవారం వెల్లడించింది. బ్యాంకర్లకు సమర్పించిన పరిష్కార ప్రణాళిక ప్రకారం.. కంపెనీ రుణభారం సెటిల్మెంట్ కోసం రూ. 42,000 కోట్లు ముందుగా చెల్లించనున్నట్లు, ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తిని పెంచుకోవడం మొదలైన వాటి కోసం మరో రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. మరోవైపు, ఆర్సెలర్ మిట్టల్‌తో కలిసి ఎస్సార్ స్టీల్‌ను సంయుక్తంగా నిర్వహించనున్నట్లు జపాన్‌కి చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమితొమో మెటల్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) వెల్లడించింది. ఈ డీల్‌కు అవసరమైన నిధులను ఈక్విటీ, రుణం రూపంలో సమకూర్చుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలను రాబట్టుకునేందుకు దివాలా చట్టం కింద ఎస్సార్ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేసిన సంగతి తెలిసిందే. న్యూమెటల్, వేదాంత మొదలైన దిగ్గజాలు కూడా పోటీపడిన ఈ వేలం ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది. చివరికి అత్యధికంగా కోట్ చేసిన బిడ్డరుగా అక్టోబర్ 19న ఆర్సెలర్ మిట్టల్ పేరును సీవోసీ ప్రకటించింది. అయితే, కంపెనీని చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లయిన రుయా కుటుంబం దాదాపు రూ.54,389 కోట్లతో బాకీలను పూర్తిగా కట్టేస్తామంటూ ఆఖరు నిమిషంలో అక్టోబర్ 25న పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించింది. కానీ, అదే రోజున ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు రుణదాతలు తుది ఆమోద ముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రతిపాదనను బ్యాంకులు కనీసం పరిశీలించాయా లేదా అన్నది కూడా తెలియరాలేదని వివరించాయి. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్ !
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్పొరేషన్ల కన్సార్షియమ్ ఎస్సార్ స్టీల్ కంపెనీని టేకోవర్ చేయనున్నది. ఎస్సార్ స్టీల్ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు చెందిన వీటీబీ గ్రూప్‌కు చెందిన న్యూమెటల్ కంపెనీ కూడా పోటీ పడింది. న్యూమెటల్ కంపెనీ రూ.37,000 కోట్లు ఆఫర్ చేయగా, ఆర్సెలర్ మిట్టల్ కన్సార్షియమ్ రూ.42,000 కోట్లు ఆఫర్ చేసింది. మరోవైపు భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కూడా సీసీఐ ఆమోదం తెలిపింది. -
ఎస్సార్ స్టీల్‌కు రూ.37 వేల కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్‌కు రెండో దశ బిడ్డింగ్‌లో రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) రష్యాకు చెందిన న్యుమెటల్ తెలియజేసింది. మరోవంక మొదటి దశలో బిడ్డింగ్ వేసిన ఏకైక కంపెనీ ఆర్సెలర్ మిట్టల్... రెండో దశ బిడ్డింగ్‌ను వ్యతిరేకించడంతో పాటు మొదటి దశ బిడ్లనే పరిశీలించాలని కోరింది. దీంతో ఎన్సీఎల్టీ ముందు న్యుమెటల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరై రెండో దశ బిడ్డింగ్ వల్ల రుణదాతలకు అదనపు విలువ సమకూరుతుందని చెప్పారు. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ.49 వేల కోట్లు బకాయి పడడంతో కంపెనీని వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సార్ స్టీల్ వేలం వ్యవహారాలు చూస్తున్న పరిష్కార నిపుణుడు రెండో దశ బిడ్డింగ్‌ను తెరవాలని, తాము రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేశామని రోహత్గి తెలిపారు. రెండో దశలో అటు ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు, న్యుమెటల్ బిడ్‌ను దాఖలు చేసింది. న్యుమెటల్‌లో రుయాలకు చెందిన ఆరోరా ట్రస్ట్‌కు 25 శాతం వాటా ఉంది. మరోవైపు రుణాలను ఎగవేసిన ఉత్తమ్ గాల్వాలో ఆర్సెలర్ మిట్టల్‌కు వాటా ఉండటం ప్రతికూలంగా మారింది. అయితే, తాము అనర్హతను తొలగించుకునేందుకు ఉత్తమ్‌గాల్వా బకాయిలను తీర్చేసేందుకు రూ.7,000 కోట్లను ఎస్క్రో ఖాతాలో జము చేసినట్టు ఆర్సెలర్ మిట్టల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. దీంతో విచారణను ఎన్సీఎల్టీ బెంచ్ ఈ నెల 22కు వాయిదా వేసింది. -
నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ఓ ఐఐటీ విద్యార్థి !
న్యూ ఢిల్లీ: ఉద్యోగం కోసం బయోడేటా, అర్హత పత్రాలతో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. ఆ వెబ్సైట్లోనే తాను అమ్మకానికి ఉన్నానంటూ తన ప్రొఫైల్ ఉంచాడు. అందులోనే తన రెజ్యూమ్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చదువుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయితే అది అందరిలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నాడో ఏమో.. వెబ్సైట్లో తాను అమ్మకానికి ఉన్నానంటూ పూర్తి వివరాలు అందించాడు. తనకు రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. రూ. 27,60,200 గా తన ధరను నిర్ణయించుకున్న మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. దేశంలోని మేధావులతో పోటీ పడినప్పుడు.. మిగతావారితో పోల్చితే మనం ఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు. మరి ఎంతో వినూత్నంగా అలోచించిన మిట్టల్‌కు ఫ్లిప్‌కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు. -
మృత్యుహేల
థాయిలాండ్ పడవ ప్రమాదంలో దంపతుల విషాదాంతం గోవా బీచ్‌లో నగర డిజైనర్ మృతి కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త తండ్రి చేతిలో హతమైన పిల్లలకు అంత్యక్రియలు వరుస సంఘటనలతో తల్లడిల్లిన నగరం గోవా, థాయిలాండ్‌లలో సంభవించిన వేర్వేరు ప్రమాదాలలో నగరానికి చెందిన ముగ్గురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో విషాదఛాయలు అలముకున్నాయి. స్విమ్మింగ్‌లో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న జూబ్లీహిల్స్‌కు చెందిన ఇంటీరియర్డిజైనర్ అపర్ణాకార్వీ (44) గోవా బీచ్‌లో ఈత కొడుతూ దురదృష్టవశాత్తూ మృత్యువాత పడ్డారు. థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లిన బంజారాహిల్స్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త యష్ అగర్వాల్ (27), ఆయన భార్య పంకూరి మిట్టల్ (25)లు అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించారు. వారి ముగ్గురి మరణ వార్తలు వినగానే బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా, సట్టా ఆడొద్దని అడ్డుకున్న పాపానికి తిరుమల గిరిలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మరోవైపు తండ్రి ప్రొఫెసర్ గురుప్రసాద్ చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నందవిహారి (5) అంత్యక్రియల సందర్భంగా మల్కాజ్‌గిరిలో విషాదఛాయలు అలముకున్నాయి. దసరా, బక్రీద్ పండుగల ఆనందంలో ఉన్న నగర వాసులు ఈ సంఘటనలతో విషాదంలో కూరుకుపోయారు.