అమెజాన్ కు ఫేస్ బుక్ కొత్త సవాల్! | Facebook to challenge Amazon soon? | Sakshi
Sakshi News home page

అమెజాన్ కు ఫేస్ బుక్ కొత్త సవాల్!

Published Sun, Jul 20 2014 1:13 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

అమెజాన్ కు ఫేస్ బుక్ కొత్త సవాల్! - Sakshi

అమెజాన్ కు ఫేస్ బుక్ కొత్త సవాల్!

అన్ లైన్ బిజినెస్ పోర్టల్ అమెజాన్ కు ఫేస్ బుక్ సరికొత్త సవాల్ విసిరేందుకు సిద్దమవుతోంది. వ్యాపార ప్రకటనల ద్వారా నేరుగా కొనుగోలు చేసే సదుపాయాన్ని సరికొత్త ఫీచర్ ద్వారా ఫేస్ బుక్ ఏర్పాటు చేయనుంది. 
 
ఈ ఫీచర్ ద్వారా డెస్క్ టాప్, మొబైల్ ఫోన్ల ద్వారా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ప్రకటన నుంచి నేరుగా కొనుగోలు అప్షన్ ద్వారా ఓ బటన్ ను క్లిక్ చేసి తమకు నచ్చిన వస్తువులు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయవచ్చు. 
 
ఫేస్ బుక్ ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ ఫేజ్ లో ఉందని ఫేస్ బుక్ వర్గాలు వెల్లండించాయి. వచ్చే గురువారం నుంచి కొన్ని ఎంపిక చేసిన ప్రోడక్ట్స్ కు ఈ ఫీచర్ ను అమల్లోకి తీసుకువస్తున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది. 
 
ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే ఆన్ లైన్ బిజినెస్ లో దిగ్గజంగా ఉన్న అమెజాన్ వ్యాపారంలో కొంత వాటాను సొంతం చేసుకోవాలని ఫేస్ బుక్ ఆశిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement