న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఉద్యోగ నియామకాల విషయంలో ఎంతో ఆశావాదంతో ఉన్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయంగా మన దేశం మూడో స్థానంలో ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 22 శాతం కంపెనీలు రానున్న మూడు నెలల్లో మరింత మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు వెల్లడైంది.
ఈ విషయంలో అంతర్జాతీయంగా తైవాన్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 4,500 కంపెనీల అభిప్రాయాలను ఈ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. జపాన్ 24 శాతంతో రెండో స్థానంలో ఉండగా, 22 శాతం ఆశావహంతో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మ్యాన్‌పవర్ గ్రూపు 43 దేశాల్లో 59,000 కంపెనీలను ఇంటర్వ్యూ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment