న్యూఢిల్లీ : ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లోఇటీవల ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో నెటిజన్లు తమ పాత వాట్సాప్ యాప్‌ను డిలీట్ చేసి కొత్త యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొత్త యూజర్లు కూడా లేటెస్ట్ వర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారు. అయితే ఫేక్, వైరస్ ప్రొగ్రామింగ్ ఉన్న వాట్సాప్‌ను పది లక్షలకు (10,00,000) పైగా తమ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారట.
ఇది గుర్తించిన వాట్సాప్ యాజమాన్యం సంబంధిత ప్లే స్టోర్, ఇతర యాప్ డౌన్ లోడింగ్స్ నుంచి ఫేక్ వాట్సాప్ యాప్‌ను డిలీట్ చేసింది. అసలైన వాట్సాప్ యాప్ ను వంద కోట్లకు పైగా నెటిజన్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘అప్‌డేట్ వాట్సాప్ మెసెంజర్’ అనే పేరుతో ఉన్న యాప్‌ను అసలైన యాప్‌గా భావించి నెటిజన్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని.. వారంతా ఆ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి అసలైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి వినియోగించాలని ఆ సంస్థ యాజమాన్యం సూచించింది.
ఫేమస్ గేమింగ్ యాప్ ‘టెంపుల్ రన్ 2’ నకిలీ యాప్‌ను ప్లే స్టోర్‌లో గత అక్టోబర్‌లో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. ఇలాంటి నకిలీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని యూజర్లు వాడితే.. వారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్‌ను పంపిన తర్వాత 7 నిమిషాల్లోపు ఆ సందేశాన్ని పంపిన వ్యక్తి (సెండర్) డిలీట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment