8-9 శ్రేణి వృద్ధి రేటు సత్తా ఉంది: జైట్లీ | Finance Minister Arun Jaitley asks CAG not to sensationalise its report | Sakshi
Sakshi News home page

8-9 శ్రేణి వృద్ధి రేటు సత్తా ఉంది: జైట్లీ

Published Thu, Oct 30 2014 1:41 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

8-9 శ్రేణి వృద్ధి రేటు సత్తా ఉంది: జైట్లీ - Sakshi

8-9 శ్రేణి వృద్ధి రేటు సత్తా ఉంది: జైట్లీ

న్యూఢిల్లీ: భారత్‌కు 8 నుంచి 9 శాతం శ్రేణిలో వృద్ధి రేటును సాధించే సత్తా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పేర్కొన్నారు. మంచి పరిపాలన, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదం చేసే అంశాలుగా విశ్లేషించారు. ఈ విషయంలో గత రెండేళ్లలో జరిగిన లోటుపాట్లే జీడీపీ ఐదు శాతం దిగువకు పడిపోవడానికి కారణమని సూచించారు. ఇక్కడ కాగ్‌కు సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాడ్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో పెట్టుబడులు మందగించాయని, సహజ వనరుల కేటాయింపుల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వచ్చాయని అన్నారు. పరిపాలనలో బాధ్యత, పారదర్శకత అవసరమని అన్నారు. ఆడిటింగ్‌లో ప్రమాణాల పెంపు అవసరాన్ని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement