న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్ కూడా ఇదే. బడ్జెట్ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం వెలువరించిన బడ్జెట్ సర్క్యూలర్(2020–21) వెల్లడించింది. ఈ సమావేశాలకు అవసరమైన వివరాలను ఆర్థిక సలహాదారులందరూ అందజేయాల్సి ఉందని ఈ సర్క్యూలర్ పేర్కొంది. వచ్చే నెల మొదటివారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొంది.
కొత్త అంశాలు....
వచ్చే ఏడాది బడ్జెట్లో కొత్తగా ఎస్‌సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్, లింగ, చిన్న పిల్లల బడ్జెట్ స్టేట్‌మెంట్స్ కూడా చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
ఈ నెల 14 నుంచి బడ్జెట్ కసరత్తు
Published Mon, Oct 7 2019 5:18 AM | Last Updated on Mon, Oct 7 2019 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment