ఈక్విటీ ఫండ్సా? డెట్ ఫండ్సా?
ఫైనాన్షియల్ బేసిక్స్...
మార్కెట్‌లో చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫండ్ ఎంపికకు ముందే మనం (ఇన్వెస్టర్) తొలిగా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలా? లేదా డెట్ ఫండ్‌ని ఎంపిక చేసుకోవాలా? అని నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘకాలంలో పెట్టుబడులకు సరైన ప్రతిఫలం పొందాలంటే మన పొర్ట్‌ఫోలియోలో ఈక్విటీ అసెట్స్ తప్పనిసరి. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమంటే కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. మార్కెట్ పరిస్థితులకు అనువుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫండ్ ఎంపిక ఇలా..
ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం: ఆర్థిక లక్ష్యాలకు అనువుగా ఇన్వెస్ట్‌మెంట్స్ జరగాలి. కొంత రాబడి కోసమైతే డెట్ ఫండ్స్ వైపు చూడాలి. అదే సంపద వృద్ధి కోసం ఈక్విటీ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి.
పెట్టుబడుల కాలం: ఇన్వెస్టర్ ఒక అసెట్ తరగతిని ఎంపిక చేసుకునేటప్పుడు అందులో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాన్ని అప్పటికే నిర్ణయించుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ల కాలం ఐదేళ్లలోపు ఉంటే డెట్ ఫండ్‌ని, ఐదేళ్ల పైన ఉంటే ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలి.
రాబడి అంచనా: మన రాబడి అంచనాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక ఉండాలి. ఒక్కొక్క ఫండ్ రాబడి ఒక్కోలా ఉంటుంది. ఈ రాబడిని అప్పటి పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో సగటున డెట్ ఫండ్స్ రాబడి 9 శాతంగా, ఈక్విటీ ఫండ్స్ రాబడి 16 శాతంగా ఉండొచ్చు.
చివరిగా: ఏ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి? అనే ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత ఫండ్ హౌస్‌ను ఎంచుకోవాలి. ఫండ్ హౌస్ బ్రాండ్ విలువ, దాని మేనేజ్‌మెంట్, ఇది వరకు ఫండ్ పనితీరు, సేవల నాణ్యత వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.