న్యూఢిల్లీ: బీపీవో సర్వీసుల దిగ్గజం ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2013-14 నాలుగో ఆర్థిక సంవత్సరంలో రూ. 58.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 40.2 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 46 శాతం అధికం. మరోవైపు, ఆదాయం 11 శాతం పెరిగి రూ. 796 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 2,280 మేర తగ్గించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 27,666కి పరిమితమైంది.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 4,200 మేర తగ్గింది. మరోవైపు, ఆదాయం 10% పెరిగి రూ. 3,105 కోట్లకు, లాభం 31 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరింది. 2013-14 సంవత్సరం లాభదాయకంగా సాగిందని, క్రితం సంవత్సరంతో పోలిస్తే నికర లాభం 31 శాతం మేర పెరిగిందని ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ చైర్మన్ సంజీవ్ గోయెంకా తెలిపారు.ఫిలిప్పీన్స్‌లో కొత్తగా రెండో డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం మీద 46 సెంటర్స్ ఉన్నట్లవుతుందని ఆయన వివరించారు. కంపెనీ ఆదాయాల్లో టెలికం అండ్ మీడియా వాటా 43 శాతంగా, హెల్త్‌కేర్ 34 శాతంగా, బీఎఫ్‌ఎస్‌ఐ వాటా 22 శాతంగా ఉంది.
ఫస్ట్ సోర్స్ లాభం 46 శాతం అప్
Published Sat, May 3 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement