First source
-
ఫస్ట్‌సోర్స్‌లో రాకేష్ పెట్టుబడి- షేరు జూమ్
సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా తాజాగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. బీఎస్ఈ గణాంకాల ప్రకారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 57 లక్షల షేర్లను అదనంగా కొనుగోలు చేశారు. ఇది కంపెనీ ఈక్విటీలో 0.86 శాతం వాటాకు సమానంకాగా.. దీంతో ఫస్ట్‌సోర్స్‌లో రాకేష్ వాటా 2.88 శాతానికి బలపడింది. వెరసి బీపీవో సేవల కంపెనీ ఫస్ట్‌సోర్స్‌లో ప్రస్తుతం రాకేష్ జున్‌జున్‌వాలా 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నట్లయ్యింది. మార్చి చివరికల్లా కంపెనీలో రాకేష్ వాటా 2.06 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఫండ్స్ సైతం గత మూడు నెలల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటా ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్‌లో 7.46 శాతం నుంచి 7.78 శాతానికి పెరిగింది. అయితే ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 9 శాతం నుంచి 7.64 శాతానికి తగ్గింది. ఈ వార్తల నేపథ్యంలో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 9.4 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. షేరు 2019 సెప్టెంబర్ 16న రూ. 55.3 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా.. ఈ ఏడాది మార్చి 24న రూ. 20 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. -
ఫస్ట్ సోర్స్ లాభం 46 శాతం అప్
న్యూఢిల్లీ: బీపీవో సర్వీసుల దిగ్గజం ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2013-14 నాలుగో ఆర్థిక సంవత్సరంలో రూ. 58.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 40.2 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 46 శాతం అధికం. మరోవైపు, ఆదాయం 11 శాతం పెరిగి రూ. 796 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 2,280 మేర తగ్గించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 27,666కి పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 4,200 మేర తగ్గింది. మరోవైపు, ఆదాయం 10% పెరిగి రూ. 3,105 కోట్లకు, లాభం 31 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరింది. 2013-14 సంవత్సరం లాభదాయకంగా సాగిందని, క్రితం సంవత్సరంతో పోలిస్తే నికర లాభం 31 శాతం మేర పెరిగిందని ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ చైర్మన్ సంజీవ్ గోయెంకా తెలిపారు.ఫిలిప్పీన్స్‌లో కొత్తగా రెండో డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం మీద 46 సెంటర్స్ ఉన్నట్లవుతుందని ఆయన వివరించారు. కంపెనీ ఆదాయాల్లో టెలికం అండ్ మీడియా వాటా 43 శాతంగా, హెల్త్‌కేర్ 34 శాతంగా, బీఎఫ్ఎస్ఐ వాటా 22 శాతంగా ఉంది.