న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది.
అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు వెనక్కి లాగుతున్నప్పటికీ... బలమైన విదేశీ మారక నిల్వలతో మధ్య కాలానికి వృద్ధి పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్–జూన్) 5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ‘‘దేశీయ డిమాండ్ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment