
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో మొదటిదని, దేశంలో రెండో సెంటర్ అని ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ ఆపరేటర్ ‘కంట్రోల్ ఎస్’ (సీటీఆర్‌ఎల్ ఎస్) పార్టనర్‌షిప్‌తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు. విక్రయదారులు, ఎంఎస్‌ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని, నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ తెలిపారు.
ఈ సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డేటా సెంటర్స్ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దీంతో మరిన్ని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment