న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అమెరికన్ లగ్జరీ వాచ్‌లు, ఫ్యాషన్ యాక్ససరీస్‌ల కంపెనీ ఫాజిల్... వేరబుల్ డివెజైస్ విభాగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ మిస్ ఫిట్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. మిస్‌ఫిట్ తాలూకు వేరబుల్ డివెజైస్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా. దీంతో పాటు మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లు కూడా ఫాజిల్ చేతిలోనే ఉన్నాయి. ఈ బ్రాండ్లు అన్నిటినుంచీ త్వరలో వేరబుల్ డివెజైస్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఫాజిల్ గ్రూప్ ఏసియా పసిఫిక్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాక్ క్విన్‌లాన్ ప్రకటించారు.
బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ వేరబుల్ డివెజైస్ అన్నిటినీ ప్రదర్శించారు కూడా. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో తాము ఏటా 40 శాతం కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తున్నట్లు క్విన్‌లాన్ తెలియజేశారు. ‘‘తమ చేతికి ధరించే వస్తువు కేవలం సమయాన్ని చూపించటమే కాక మరిన్ని చేయాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. పెపైచ్చు అది చాలా వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకునే మేం ఈ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నాం’’ అని కంపెనీ కనెక్టింగ్ డివెజైస్ విభాగ సీటీఓ సొన్నీ వ్యూ చెప్పారు. ఇండియాలో ప్రస్తుతం ఫాజిల్‌కు 400 స్టోర్లున్నాయని, ఆసియాలో జపాన్ తరవాత ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని ఫాజిల్ గ్రూప్ ఇండియా ఎండీ వసంత్ నంగియా చెప్పారు.
2020 నాటికి వాచ్‌ల అమ్మకాలను వేరబుల్ డివెజైస్ మించిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. వేరబుల్ డివెజైస్‌తో ఎన్ని కేలరీస్, దూరం, నిద్ర వంటి పలు అంశాలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయొచ్చని చెప్పారాయన. ప్రస్తుతం మిస్‌ఫిట్ బ్రాండ్ కింద లభిస్తున్న డివెజైస్ ప్రారంభ ధర రూ.7,495గా ఉంది. కంపెనీ ఫాజిల్ క్యూ బ్రాండ్ కింద వండర్, మార్షల్ అనే రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. వీటి ప్రారంభ ధర రూ. 21,995గా ఉంది. ఇక మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లలో హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్‌ల ధరలు రూ.9,995-రూ.29,495 శ్రేణిలో ఉన్నాయి.
వేరబుల్ విభాగంలోకి ఫాజిల్ గ్రూప్
Published Thu, Oct 6 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement