భారత కంపెనీలు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ విషయంలో జోరును కొనసాగిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ విషయంలో స్వదేశీ కంపెనీలు దుమ్మురేపుతున్నాయి. భారత మార్కెట్లలో చైనా కంపెనీలు మాత్రం బొక్కబోర్ల పడ్డాయి.
గణనీయమైన వృద్ధి..!
మార్కెట్ ట్రాకర్ల డేటా ప్రకారం..2021లో స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ ఇయర్‌బడ్ మార్కెట్లలో బోట్, ఫైర్‌బోల్ట్, నాయిస్ లాంటి భారతీయ బ్రాండ్‌లు 75 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. వెరబుల్ గాడ్జెట్స్‌లో చైనీస్ బ్రాండ్‌లు మాత్రం శాసించలేకపోయాయి. స్మార్ట్‌వాచ్, టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ అమ్మకాలు సంవత్సరానికి 280శాతం పెరిగాయి. మార్కెట్ ట్రాకర్ ప్రకారం స్మార్ట్‌వాచ్ విభాగంలో బోట్, నాయిస్, ఫైర్‌బోల్ట్ వాల్యూమ్ ఆధారంగా మార్కెట్‌లో 66 శాతం వాటాతో మొదటి మూడు కంపెనీలుగా అవతరించాయి. ఈ విభాగంలో భారతీయ బ్రాండ్లు 2021లో చైనీస్ కంపెనీల గ్రోత్ రేట్ 17 శాతంతో పోల్చితే స్వదేశీ కంపెనీలు భారీగా 76 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి.
తక్కువ ధరలో..ఎండోర్స్‌మెంట్‌లో దూకుడు..!
వెరబుల్స్ గాడ్జెట్స్‌ను భారత స్వదేశీ కంపెనీలు తక్కువ ధరలో అందించాయి. దీంతో కొనుగోలుదారులు వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపారు. తక్కువ ధరలే కాకుండా దిగ్గజ నటులతో ఎండోర్స్‌మెంట్ చేస్తూ మార్కెట్‌లో సత్తా చాటాయి. సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లు, పరిచయ ధర పథకాలు, తగ్గింపు ఆఫర్‌లు, సరసమైన ఫీచర్-రిచ్ పరికరాలు, కొత్త లాంచ్‌ల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి వ్యూహాలు భారతీయ బ్రాండ్‌లకు బాగా పనిచేశాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు అన్షికా జైన్ అన్నారు. Ptron, Mivi, Boult Audio వంటి ఇతర స్థానిక బ్రాండ్‌లు తమ పోర్ట్‌ఫోలియోను తక్కువ-ధర విభాగంలో విస్తరించాయి.ఇవి కస్టమర్‌ల నుంచి సానుకూల స్పందనను పొందాయి.
స్మార్ట్‌ఫోన్ రంగంలో మాత్రం చైనానే టాప్‌గా..!
వెరబుల్ సెక్టార్‌లో భారత కంపెనీలు టాప్‌లో నిలిచిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనా కంపెనీలే టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భారత స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చైనా కంపెనీలను అందుకోలేకపోయాయి. చైనా కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో కొత్త వెర్షన్ స్మార్ట్‌ఫోన్ విభాగాలను తెస్తూ ముందున్నాయి.
చదవండి: అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే నాప్‌టాల్ సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment