నాలుగో రోజూ నష్టాల్లోనే.. | fourth day also in lose | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ నష్టాల్లోనే..

Published Wed, Jul 29 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

నాలుగో రోజూ నష్టాల్లోనే..

నాలుగో రోజూ నష్టాల్లోనే..

♦ ముందు జాగ్రత్తలో ఇన్వెస్టర్లు
♦ ఫెడ్,ఆర్‌బీఐ పాలసీల నేపథ్యం...
♦ 102 క్షీణించి 27,459కు సెన్సెక్స్
♦ 24 మైనస్‌తో 8,337కు నిఫ్టీ...
 
 స్టాక్ మార్కెట్ నష్టాలు నాలుగోరోజూ కొనసాగాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు క్షీణించి 27,459 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,337 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది నెలరోజుల కనిష్ట స్థాయి. కొన్ని బ్యాంక్, ఆర్థిక సేవల, వాహన, ఫార్మా షేర్లు ట్రేడింగ్ చివరి రెండు గంటల్లో స్టాక్ మార్కెట్ సూచీలను పడగొట్టాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,046 పాయింట్లు నష్టపోయింది.     

 రేట్ల కోత ఉండకపోవచ్చు...
 వచ్చే వారం జరగనున్న ఆర్‌బీఐ పరపతి సమీక్ష,  మంగళవారం ప్రారంభమైన అమెరికా ఫెడ్  సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం వెలువడవచ్చనే నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని నిపుణుల అంచనా. అదీకాక కంపెనీల ఫలితాలు ఆశించినంతగా లేవన్నదీ విశ్లేషణ.

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 శాతం అప్
 ఆర్థిక ఫలి తాలు బాగా ఉండటంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 శాతం, యూనియన్ బ్యాంక్ 2 శాతం చొప్పున పెరిగాయి.  30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టపోయాయి. 388 షేర్లు లాభపడగా, 1,363 షేర్లు నష్టపోయాయి.  టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,318  కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ. 18,178 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,04,400 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,376 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.665 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement