రహదారి భద్రత ప్రాజెక్టులకు ఐటీ మినహాయింపు
న్యూఢిల్లీ: రహదారి భద్రతను మెరుగుపర్చేవి, ప్రమాదాలను నివారించేవిగాను ఉండే ప్రాజెక్టులకు ఆదాయ పన్ను (ఐటీ) నుంచి మినహాయింపు లభిస్తుందని రహదారుల శాఖకు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఇందుకోసం సదరు ప్రాజెక్టు అర్హమైనదిగా ప్రకటించాలంటే ముందుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ జాతీయ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. రహదారుల శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్‌కు రాసిన లేఖలో ఈ అంశాలు తెలిపారు.
రహదారుల భద్రతను ప్రోత్సహించేలా, ట్రాఫిక్‌పై అవగాహన పెంచేలా చేపట్టే ప్రాజెక్టులకు పన్ను మినహాయింపులపై స్పష్టతనివ్వాలంటూ రహదారుల శాఖ కోరిన నేపథ్యంలో శక్తికాంత దాస్ తాజా వివరణ ఇచ్చారు.