
సాక్షి, న్యూఢిల్లీ : 2019-20 ఆర్ధిక సంవత్సరంలో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో 4.2 శాతంగా నమోదైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసంలో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన 4.1 శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం అంచనా వేయగా వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో కేవలం 4.2 శాతానికే పరిమితమైంది.
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీడీపీ వృద్ధి గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కోవిడ్-19 లాక్‌డౌన్‌తో తయారీ, సేవా రంగాలు నిలిచిపోయిన క్రమంలో జీడీపీ వృద్ధిపై అది పాక్షిక ప్రభావం చూపింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.1 శాతం మేర వృద్ధి సాధించింది.
చదవండి : తీవ్ర సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ: గోల్డ్‌మెన్ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment