సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ముఖ్యంగా అమెరికా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఆంరంభంలోనే 650 పాయింట్లకుపైగా కుప్పకూలింది. ప్రస్తుతం ఆరంభ నష్టాలనుంచి తేరుకుని 433 పాయింట్లను కోల్పోయి 31562 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 9265 వద్ద కొనసాగుతోంది. తద్వారా భారీ ప్యాకేజీ ఆశలతో బుధవారం నాటి భారీ లాభాలు మొత్తం ఈ రోజు ఆవిరై పోయాయి. సెన్సెక్స్ 32 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9250 దిగువన ట్రేడ్ అవుతోంది. (మెగా ప్యాకేజీ : భారీ లాభాలు)
ప్రధానంగా ఫైనాన్షియల్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటామోటర్స్, పవర్ గ్రిడ్, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోతుండగా, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ స్వల్పంగా లాభపడుతున్నాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పెరిగి 11,609, బీఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 10,763 వద్ద కొనసాగుతున్నాయి.
మరోవైపు కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఆర్థికమాంద్యం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయని, అదనపు నిధులు విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడవలసి ఉంటుందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. అటు ఆసియా మార్కెట్లుకూడా ప్రతికూలంగానే ఉన్నాయి.(కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన) (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక)
Comments
Please login to add a commentAdd a comment