
సాక్షి, ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు, కరోనా మహమ్మారి దేశంలో విస్తరిస్తోందన్న ఆందోళనతో దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమైనాయి. అనంతరం మరింత బలహీన పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 636 పాయింట్లు పతనమై 33144 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు కోల్పోయి 9796 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 33500, నిఫ్టీ 9800 స్థాయి దిగువకు చేరాయి.
ప్రధానంగా బ్యాంకింగ్ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతికూలంగా ఉండగా, మీడియా, ఐటీ ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ , హెచ్ డీఎఫ్ సీ భారీగా నష్టపోతున్నాయి. ఇంకా టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్‌టి, హీరో మోటోకార్ప్ తదితర షేర్లు కూడా బలహీనంగా ఉన్నాయి.
చదవండి :పెట్రో వాత : ఎంత పెరిగింది?
మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
Comments
Please login to add a commentAdd a comment