ఆల్ టైమ్ రికార్డుకు చేరిన బంగారం ధర (34,500)
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలహీనపడటంతో బులియన్ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్ లో బంగారం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. పది గ్రాముల బంగారం ధర 34,500 రూపాయలు ట్రేడ్ అయింది. నేటి మార్కెట్ లో 1900 రూపాయలు పెరిగింది. బంగారం ధరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు.
గత సంవత్సరం నవంబర్ 27న బంగారం 32975 రూపాయలు నమోదు చేసుకోవడం ఇప్పటి వరకు గరిష్టం. బుధవారం మార్కెట్ లో వెండి 3700 రూపాయలు పెరిగి 58500 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి 68.80 వద్ద క్లోజ్ అవ్వడమే బంగారం, వెండి పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు.