మళ్లీ మెరిసిన పసిడి!
న్యూయార్క్/ముంబై: కొన్ని వారాలుగా మసకబారుతున్న బంగారం ధర మళ్లీ శుక్రవారం మెరిసింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లో కడపటి సమాచారం అందే సరికి క్రితం ముగింపుతో పోల్చితే.. 25 డాలర్ల లాభంతో 1,086 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. కడపటి సమాచారం అందేసరికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ధర 10 గ్రాములకు క్రితంతో పోల్చితే దాదాపు రూ.500 లాభంతో రూ. 25,725 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా కేజీకి భారీగా రూ. 825 ఎగసి రూ.35,125 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే... శనివారం స్పాట్ మార్కెట్‌లో ధర పెరిగే అవకాశం ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ డిపాజిట్ రేటును తగ్గించిన నేపథ్యంలో డాలర్‌పై యూరో బలపడ్డం తాజా పసిడి జోరుకు కారణం.
దేశీయ మార్కెట్‌లో లాభం...
ఇదిలావుండగా, ప్రధాన ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర మూడున్నర నెలల కనిష్ట స్థాయి నుంచి పెరి గింది. 99.9 ప్యూరిటీ ధర క్రితంతో పోల్చితే రూ.225 ఎగసి రూ. 25,290కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం పెరిగి రూ. 25,140కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.290 ఎగసి రూ.34,600 పలికింది.