
ముంబై: దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.1097 తగ్గి రూ.42,600కి పడిపోయింది. వెండి కూడా బంగారం ధర లాగానే బాగా తగ్గాయి. కిలోకు రూ.1574 తగ్గి రూ.44,130కి చేరుకుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడం, రూపాయి విలువ బలపడటంతో బంగారం ధరలు తగ్గాయి. ఇక, అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1584 డాలర్లు ఉండగా, వెండి ధర 15.65 డాలర్లుగా నమోదైంది. ఆర్‌బీఐ ఆర్థక విధానాలపై దృష్టి కేంద్రీకరించడంతో రూపాయి విలువ 25పైసలు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో స్టాక్ మార్కెట్లు ఉదయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment