Tumbles
-
ఈ మిడ్ క్యాప్ షేర్లకూ అమ్మకాల సెగ
భారీ లాభాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల పిడుగు పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. వెరసి భారీ నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, సిటీ యూనియన్ బ్యాంక్, దీపక్ నైట్రైట్, ప్రిజమ్ జాన్సన్, లా ఒపాలా ఆర్జీ.. పతన బాటలో సాగుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కుప్పకూలి రూ. 1950 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1883 వరకూ జారింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 13,500 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 15,000 షేర్లు చేతులు మారాయి. సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం పతనమై రూ. 135 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.42 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 5.85 లక్షల షేర్లు చేతులు మారాయి. దీపక్ నైట్రైట్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతంపైగా దిగజారి రూ. 671 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.59 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి. ప్రిజమ్ జాన్సన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం పడిపోయి రూ. 52 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 48,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.02 లక్షల షేర్లు చేతులు మారాయి. లా ఒపాలా ఆర్జీ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం కోల్పోయి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 23,000 షేర్లు చేతులు మారాయి. -
రూ.5.8 లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లో సోమవారం నాటిఅమ్మకాలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. లాక్డౌన్ పొడగింపు, అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచమార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర పతనమైంది. ఆరంభ నష్టాల నుంచి మరింత బలహీన పడిన మార్కెట్ ఒక దశలో 2 086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 1791 పాయింట్లు లేదా 8శాతం పైగా పడిపోయి 19,744 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.86 శాతం క్షీణించింది. (దీర్ఘకాల లాక్డౌన్ : కుప్పకూలిన మార్కెట్లు) ప్రధానంగా ఆసియా ఈక్విటీలలోని భారీ అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.దీంతో బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల్లో నేటి పతనంతో రూ. 5.8 ట్రిలియన్ల పెట్టుబడిదారుల సంపద తుడుచిపెట్టుకు పోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల 15వేల 309 కోట్ల రూపాయలు తగ్గి 1,24,26,311.83 కోట్లకు చేరుకుంది.(లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం) ఐసీఐసీఐ బ్యాంక్ (11 శాతం తగ్గి) ఇండెక్స్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూడగా, బజాజ్ ఫైనాన్స్ (10 శాతం), హెచ్డీఎఫ్సీ (10 శాతం) ఇండస్ఇండ్ బ్యాంక్ (9.6 శాతం) భారీగా నష్టపోయాయి. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో టెక్ మహీంద్రా 8 శాతం, హిందూస్థాన్ యూనిలీవర్ 5 శాతం క్షీణించింది. నిఫ్టీ ఫార్మ మాత్రమే స్వల్పంగా లాభపడింది. అలాగే కొన్ని షరతులతో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించిన తరువాత బ్రూవరీస్ అండ్ డిస్టిలరీ కంపెనీల షేర్లు దాదాపు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. చివరికి 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద, నిఫ్టీ 566 పాయింట్లు కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ 32 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) -
తగ్గిన బంగారం ధరలు
ముంబై: దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.1097 తగ్గి రూ.42,600కి పడిపోయింది. వెండి కూడా బంగారం ధర లాగానే బాగా తగ్గాయి. కిలోకు రూ.1574 తగ్గి రూ.44,130కి చేరుకుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడం, రూపాయి విలువ బలపడటంతో బంగారం ధరలు తగ్గాయి. ఇక, అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1584 డాలర్లు ఉండగా, వెండి ధర 15.65 డాలర్లుగా నమోదైంది. ఆర్బీఐ ఆర్థక విధానాలపై దృష్టి కేంద్రీకరించడంతో రూపాయి విలువ 25పైసలు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో స్టాక్ మార్కెట్లు ఉదయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. -
రేటింగ్ సెగ : కుప్పకూలిన అడాగ్ షేర్లు
సాక్షి,ముంబై : అనిల్ అంబానీకి చెందిన అడాగ్ షేర్లకు రేటింగ్‌షాక్ తగిలింది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లు 20 శాతానికిపైగా నష్టపోయాయి. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. రేటింగ్ సంస్థలు కంపెనీల షేర్లపై రేటింగ్‌ను డౌన్లోడ్ చేయడం, ఆయా కంపెనీలు ఎదుర్కోంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రిలయన్స్ పవర్ 20 శాతం నష్టపగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 18 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 12 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 10 శాతం, రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్స్ 6 శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ 7 శాతం నష్టపోయాయి. రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి. మొన్నటి ట్రేడింగ్ సెషన్లో జరిగిన ఓ 5 బ్లాక్ డీల్స్ ద్వారా 80లక్షల రిలయన్స్ పవర్ షేర్లు చేతులు మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలితంగా నేటి ట్రేడింగ్‌లో దాదాపు 20.17శాతం నష్టంతో రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి. కేర్, ఇక్రా రేటింగ్ సంస్థలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు డిఫాల్ట్ రేటింగ్‌ను ఇవ్వడంతో ఈ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో పదిశాతం క్షీణించాయి. -
రికార్డు కనిష్టానికి చేరువగా రుపీ
ముంబై: విశ్లేషకులు అంచనా వేసినట్టుగా రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించింది. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే బలహీనపడిన రూపాయి 28పైసలు క్షీణించి రూ.68.44 వద్ద మరింత బలహీన సంకేతాలను అందిస్తోంది. రికార్డు స్థాయి కనిష్టంతో 2013 ఆగస్టు నాటి 68. 85 స్తాయి వైపుగా కదులుతోంది. దీనికితోడు నవంబరు 8 డిమానిటేజేషన్ ప్రకటన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 12 వేల కోట్ల పెట్టబడులను దేశీయ మార్కెట్లనుంచి ఉపసంహరించుకోవడం దేశీయ కరెన్సీని బలహీపరుస్తోంది. అయితే ప్రారంభంలోనే 11 పైసలు నష్టోయిన రూపాయి 8 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. డాలర్ పుంజుకోవడం, భారీగా పుంజుకున్న అమెరికా మార్కెట్లు, డిమానిటైజేషన్ రూపాయి విలువ పతనానికి కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు డెరివెటివ్ ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా డిసెంబర్లో ఫెడ్ పెరగనున్నాయనే అంచనాలకు తోడు యూఎస్ హోమ్ సేల్స్ డేటా భారీగా నమోదు కావడంతో ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
-
వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ గా పేరొందిన బఫెట్ కేవలం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయలను నష్టపోవడం మార్కెట్ వర్గాలను విస్మయపర్చింది. 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు. బఫెట్ మేజర్ పెట్టుబడులు పెట్టిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల యాజమాన్య సంస్థ ఫార్గో అండ్ కో భారీ కుంభకోణంలో ఇరుక్కుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. 65.8 బిలియన్ డాలర్ల తోప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్ వేలకోట్ల సంపద క్షణాల్లోఆవిరైపోయింది. బఫెట్ కు చెందిన బెర్కషైర్ హాత్వే ఇంక్ వెల్స్ ఫార్గో లో అత్యధిక వాటాను కలిగింది. నిబంధనలను విరుద్ధంగా రెండు మిలియన్లకు పైగా అకౌంట్లు తెరిచారన్న ఆరోపణలతో 185 మిలియన్ డాలర్లను జరిమానాను కంపెనీ ఎదుర్కోంటోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతులు లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిరన కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా వేల్స్ ఫార్గో ఈక్విటీ విలువ 3.3 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ సంస్థలో అత్యధిక వాటాదారుగా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే ఈక్విటీ 2 శాతం పడిపోయింది. మరోవైపు ఈ భారీ జరిమానా సంస్థను తీవ్రంగా బాధించిందని , తమ ప్రతిష్టకు భంగం కలిగిందని బ్యాంక్ ప్రకటించింది. రిటైల్ బ్యాంకర్ల దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్ వచ్చేవారం సెనేట్ బ్యాంకింగ్ కమిటీముందు హాజరు కానున్నారు. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్ చేస్తామని వెల్లడించింది.