శ్రావణమాసం శుభవార్త..రూ.29వేల దిగువకు
న్యూఢిల్లీ: శ్రావణమాసం సందర్భంగా మగువలకు తీపి కబురు.బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం మరింత దిగివచ్చాయి. గత కొంత కాలంగా బలహీన ట్రెండ్‌ను కనబరుస్తున్న పుత్తడి ధరలు స్వల్పంగా పుంజుకున్నట్టు కనిపించినా మళ్లీ పతనం బాటపట్టాయి. ముఖ్యంగా బంగారం ధర గత రెండు రోజుల్లో పదిగ్రా. రూ.270 పెరిగినా, తాజాగారూ.29వేల కిందికి దిగజారింది.
అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూల ధోరణి, రీటైల్ వ్యాపారుల నుంచి తగ్గిన డిమాండ్ కారణంగా పది గ్రా. పసిడి ధర శుక్రవారం రూ.190 క్షీణించి రూ.28,860వద్ద నిలిచింది. వరలక్ష్మీ వ్రతానికి మహిళలు, ముఖ్యంగా కొత్త పెళ్లికూతుళ్లు గోరెడు బంగారమైనా కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈనేపథ్యంలో దిగి వస్తున్న పుత్తడి ధరలు శుభసూచికమే.
సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.10 శాతం పడిపోయి 1,216.10 డాలర్లకు చేరుకుంది. స్థానిక నగల మరియు చిల్లర వర్గాల నుంచి డిమాండ్ పెరిగే డిమాండ్ ప్రస్తుతం బంగారం ధరలు కూడా పెరిగింది. దేశ రాజధానిలో, 99.9శాతం స్వచ్ఛత బంగారం, 99.5శాతం స్వచ్ఛత పది గ్రాముల ధరలు వరుసగా రూ .28,860, రూ. 28,710 కు క్షీణించాయి.
అటు ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి సాంకేతిక స్థాయిలకు దిగవనే ట్రేడ్ అవుతోంది. అయితే శుక్రవారం స్వల్పంగా లాభపడి (రూ.55 ) పది గ్రా. రూ.27,892వద్ద 28వేల రూపాయలకు దిగువన కొనసాగుతోంది.
గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడడం, అంతర్జాతీయ స్టాక్స్ పెరగడంతో దేశీయ మార్కెట్లో డిమాండ్ క్షీణించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.