
31 వేలకు చేరిన పసిడి ధర
ముంబై స్పాట్ బులియన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.31 వేలు దాటింది. వెండి కేజీ ధర రూ.45వేల పైకి చేరింది.
ముంబై: ముంబై స్పాట్ బులియన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.31 వేలు దాటింది. వెండి కేజీ ధర రూ.45వేల పైకి చేరింది. ట్రంప్ గెలుపుతో రిస్క్ ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతుందన్న అంచనాలతో పుత్తడిలో పెట్టుబడులకు సురక్షితమన్న భావించిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 1,338 డాలర్ల స్థారుుకి పెరిగింది. తక్షణం తమ పెట్టుబడులకు పసిడిని రక్షణగా చూడడమే ఈ విలువైన మెటల్స్ పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమయంలో ముంబైలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.815 ఎగసి, రూ.31,295కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థారుులో ఎగసి రూ.31,145కు పెరిగింది. వెండి కేజీ ధర ఏకంగా రూ.1,390 ఎగసింది. రూ.45,370గా నమోదరుు్యంది. అరుుతే అటు తర్వాత క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పడిపోరుుంది. నెమైక్స్ మార్కెట్‌లో చూస్తే... కడపటి సమాచారం అందే సరికి పసిడి ఔన్‌స (31.1గ్రా) కేవలం 2 డాలర్ల లాభంతో 1,277 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే బలహీన ధోరణి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజీలోనూ కొనసాగుతోంది. పసిడి అతి స్వల్ప లాభంతో రూ.29,993 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలోపేతం కావడం చివరికి పసడి ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.