మా వెబ్ సైట్ హానికరం: గూగుల్
మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, ప్రతి సమాచారం కోసం గూగుల్ లో సెర్చ్ కొట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. మనకు ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో అందించే వెబ్ సైట్ లో గూగుల్.కామ్ కు ఎంతో పేరొంది. అయితే గూగుల్.కామ్ ను ఆశ్రయించడం అంత సురక్షితం కాదని ఆ సంస్థే స్వయంగా చెబుతోంది. రెడిట్ యూజర్ కనుగొన్న సెక్యురిటీ టూల్స్ లో గూగుల్.కామ్ పాక్షికంగా ప్రమాదకరమని తేలింది. దీంతో వినియోగదారుల భద్రతను సీరియస్ గా తీసుకున్న కంపెనీ, గూగుల్.కామ్ పై ఎక్కువగా దృష్టి సారించనుంది.
గూగుల్.కామ్ వెబ్ సైట్ లో ఎంత భద్రత ఉందో చెక్ చేసినప్పుడు, కొన్ని వెబ్ పేజీలు ప్రమాదకరమైన మెసేజ్ లను చూపించాయి. ఈ సైట్ నుంచి సమాచారాన్ని, సాఫ్ట్ వేర్లను దొంగలించడానికి ఎటాకర్స్ ప్రయత్నిస్తున్నారని ఈ చెకింగ్ లో వెల్లడైంది. నిరంతరం క్రోమ్ బ్రౌజర్ నేపథ్యంలో నడిచే ఈ సేఫ్టీ టూల్, యూజర్స్ ప్రమాదకరమైన వెబ్ సైట్ ను విజిట్ చేస్తే వారికి అలర్ట్ ను అందిస్తుంది. అదేవిధంగా గూగుల్ సెర్చ్, వెబ్ పేజీలపై కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
క్రోమ్ యూజర్లకే కాకుండా ఫైర్ ఫాక్స్, సఫారీ ల్లో కూడా ఈ గూగుల్ సేఫ్టీ బ్రౌజింగ్ టూల్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ యూజర్ల భద్రతకు ఇది ఎంతో కీలకమని తెలిపింది. అదేవిధంగా ఈ చెకింగ్ లో వెల్లడైన ప్రమాదకరమైన వెబ్ సైట్ లకు సంబంధించిన సమాచారాన్ని బ్లాక్ లిస్ట్ లో పొందుపర్చిన గూగుల్, భద్రత కలిగిన వెబ్ సైట్లను గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ సైట్ స్టేటస్ పేజ్ లో పేర్కొంది.