ఆరు కొత్త సెజ్‌లకు ప్రభుత్వ ఆమోదం | Government approved six New SEZ | Sakshi
Sakshi News home page

ఆరు కొత్త సెజ్‌లకు ప్రభుత్వ ఆమోదం

Published Fri, Aug 28 2015 1:50 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Government approved six New SEZ

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండలాల(స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్)కు సంబంధించి ఆరు కొత్త ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిల్లో నాలుగు ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందినవి ఉన్నాయి.  వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్(బీఓఏ) ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ అధికారి వివరించారు. వివరాలు.. హెచ్‌సీఎల్ ఐటీ సిటీ లక్నోలో ఒక సెజ్‌ను,  లోమా ఐటీ పార్క్ డెవలపర్ ముంబైలో, నార్త్ ముంబై ఇంటర్నేషనల్ కమోడిటీ టౌన్‌షిప్ ధానేలో సెజ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. మూడు సెజ్‌ల రద్దు ప్రతిపాదనలను బీఓఏ ఆమోదించింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్, హిందూస్తాన్ న్యూస్‌ప్రింట్‌లు... రద్దైన ప్రతిపాదనల్లో ఉన్నాయి.  ఐటీ సెజ్ ఏర్పాటు కోసం ఎమ్మార్ ఎంజీఎఫ్ 2012లోనే ఆమోదం పొందింది. అప్పటి నుంచి గడవును పొడిగించడం కానీ, ఈ సెజ్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కానీ ఏమీ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement