New proposals
-
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
అత్యంత నిపుణులకే హెచ్1బి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియను మరింత కఠినం చేస్తూ అమెరికాలో ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు అవకాశం కల్పించడం, వారికి అత్యధిక వేతనాలు పొందేలా చూడటమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రభుత్వం తన తాజా నోటీసుల పేర్కొంది. తాజా సవరణల కారణంగా అమెరికాలో ఉన్నత విద్యార్హతలు సాధించిన విదేశీయులు ఎక్కువ మందికి హెచ్1బీ వీసాలొస్తాయని ట్రంప్ సర్కారు చెబుతోంది. హెచ్1బీ వీసాపై విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు తమ దరఖాస్తులను ముందుగానే ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను ప్రతిపాదించింది. భారతీయ ఐటీ కంపెనీలు, వృత్తి నిపుణులు ఎక్కువగా ఆశించే హెచ్1బీ వీసా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా కింద సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రత్యేక ఉద్యోగాలకు విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తోంది. భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులను అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాలపైనే ఉద్యోగులుగా నియమిస్తున్నాయి. అయితే, తమ ఉద్యోగులుగా నియమించనున్న విదేశీ నిపుణుల తరఫున కంపెనీలు దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)లో ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయించుకోవాలనే కొత్త నిబంధన ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్దేశించిన గడువులోపే ఎలక్ట్రానిక్ నమోదు పూర్తవ్వాలని పేర్కొంది. 65వేల హెచ్1బీ వీసాలు ప్రస్తుత విధానం ప్రకారం అమెరికా ఏటా 65,000 సాధారణ హెచ్1బీ వీసాలు, 20,000 అధిక విద్యార్హతల వీసాలు మంజూరు చేస్తోంది. అధిక విద్యార్హతలున్న వారు 20,000 కంటే ఎక్కువుంటే కంప్యూటర్ లాటరీ ద్వారా 20వేల మందినే ఎంపిక చేస్తోంది. మిగిలిన వారిని సాధారణ దరఖాస్తుదారులతో కలిపేసి వారిలోంచి 65,000 మందిని ఎంపిక చేస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మొదట పరిమితి మేరకు 65,000 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో అధిక విద్యార్హతలున్న వారూ కొంత మంది ఎంపికవుతారు. ఎంపికకాని అధిక విద్యార్హతలున్న వారందరినీ ప్రత్యేక కోటాలో చేర్చి వారిలోంచి 20,000 మందిని ఎంపిక చేస్తారు. అంటే, కోటా కింద ఎంపికయ్యే 20వేల మంది కాక, సాధారణ కోటాలో ఎంపికయ్యే వారిలోనూ అధిక విద్యార్హతలున్నవారు ఉండే అవకాశం ఉంది. నిబంధనల మార్పు కారణంగా మొత్తం వీసాలు పొందిన వారిలో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన వారు 16శాతం వరకు (5,340 మంది) పెరుగుతారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వివరించింది. తాజా ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా అక్కడి పౌరులను డీహెచ్ఎస్ కోరింది. జనవరి 2లోగా అభిప్రాయాలు సమర్పించాలని సూచించింది. ఎలక్ట్రానిక్ నమోదు ప్రక్రియతో ఉద్యోగుల కోసం సంస్థలు చేసే దరఖాస్తుల ఖర్చు తగ్గుతుందని, ఎంపిక ప్రక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని యుఎస్సీఐఎస్ తెలిపింది. వేల దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించే శ్రమ తగ్గుతుందని, తుదిజాబితా కోసం ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. అమెరికన్ల ప్రయోజనాల కోసం వీసా నిబంధనలను మార్చాలని గత ఏడాది డీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. -
మంజీర
ఈ పేరుతోనే ‘సంగారెడ్డి జిల్లా’! తెరపైకి కొత్త ప్రతిపాదనలు ♦ మెదక్‌లో కలవడానికి ఖేడ్, అందోల్, నర్సాపూర్ నేతల ‘నో’ ♦ పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ ♦ అయిష్టంగానే అంగీకరించిన ప్రజాప్రతినిధులు ♦ ప్రతి జిల్లాకు రెండేసి రెవెన్యూ డివిజన్లు ♦ తీర్మానం చేసి కేకేకు అందజేసిన జిల్లా ప్రజాప్రతినిధులు ♦ రాజధానిలో ముగిసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం మంజీర జిల్లా.. సంగారెడ్డి, కొండాపుర్, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం. నారాయణఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టితోపాటు కొత్త మండలాలైన కంది, అమీన్‌పుర్, గుమ్మడిదల, మొగుడంపల్లి (జహీరాబాద్ నియోజకవర్గం), సిర్గాపూర్, నాగల్గిద్ద(నారాయణఖేడ్), వట్పల్లి(అందోల్) మండలాలు. రెవిన్యూ డివిజన్లు: సంగారెడ్డితోపాటు జహీరాబాద్ లేదా నారాయణఖేడ్‌లో ఏదో ఒకటి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణతో కీలక ఘట్టం ముగిసింది. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లోని ప్రాంతాల పంపకాలపై ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంజీర పేరిట సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ చేసిన ప్రతిపాదనకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఏకంగా మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లాలో కలవడానికి ససేమిరా అనడంతో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినట్టు విశ్వసనీయ సమాచారం. చివరకు మంత్రి జోక్యంతో సదరు ప్రజాప్రతినిధులు అయిష్టంగానే ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెద్ద జిల్లాగా సంగారెడ్డి... కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాల్లో మంజీర పేరుతో సంగారెడ్డి అత్యంత పెద్ద జిల్లాగా అవతరించనుంది. మంజీర (సంగారెడ్డి)లో 26 మండలాలు, సిద్దిపేటలో 18, మెదక్ జిల్లాలో 17 మండలాల చొప్పున పంపకాలు చేస్తూ తీర్మానం చేశారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు, కార్యక్రమ సమన్వయకర్త కె.కేశవరావుకు అందజేశారు. ఆయన వాటిని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ప్రజాప్రతినిధుల అభ్యంతరం.. అధికారులు సీసీఎల్ఏకు పంపిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు అధికారులు నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలో, అందోల్‌ను మెదక్ జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ప్రజా ప్రతినిధుల తీర్మానం మాత్రం కొంత భిన్నంగా ఉంది. నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపడాన్ని సదరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఏ మాత్రం ఇష్టపడలేదు. తమ నియోజకవర్గాలను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని మధ్యేమార్గంగా ఓ పరిష్కారం చూపుతూ తీర్మానం చేసినట్టు తెలిసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం... ⇒ కొత్త తీర్మానం ప్రకారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఒక్క పెద్దశంకరంపేటను మాత్రమే మెదక్ జిల్లాలో కలుస్తుంది. ఇదే నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న సిర్గాపూర్, నాగల్గిద్ద మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలుపుతున్నారు. ⇒ అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాలను సంగారెడ్డిలోనే కలుపుతున్నారు. అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని తీర్మానం చేశారు. మెదక్ జిల్లాలో కలుస్తున్న ఈ మూడు మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ వట్పల్లి మండల కేంద్రాన్ని చేసి దాన్ని సంగారెడ్డిలోనే కలపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ⇒ నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మినహా మిగిలిన మండలాలను మెదక్‌లోనే కలుపుతూ తీర్మానించారు. దీన్ని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినట్టు తెలిసింది. నర్సాపూర్ మండలాన్ని కూడా సంగారెడ్డిలోనే కలపాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు ఫారెస్టు ఉందని, ఒక్క సంగారెడ్డి రోడ్డుకు మాత్రమే ఫారెస్టు లేదని, తమ ప్రాంతం అభివృద్ధి కేవలం అటువైపు మాత్రమే జరుగుతుందని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది. ఇదే మండలంలోని మూసాపేట సంగారెడ్డి పట్టణానికి కేవలం 14 కిలో మీటర్ల దూరంలో ఉంటుందని, ఇబ్రహింబాద్ 16 కిలో మీటర్లు ఉంటుందని, అదే మెదక్ జిల్లాలో కలిపితే 60 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారి ఆందోళనను పట్టించుకోకుండానే నర్సాపూర్ మండలాన్ని మెదక్ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. -
ఆరు కొత్త సెజ్‌లకు ప్రభుత్వ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండలాల(స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్)కు సంబంధించి ఆరు కొత్త ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిల్లో నాలుగు ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందినవి ఉన్నాయి. వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్(బీఓఏ) ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ అధికారి వివరించారు. వివరాలు.. హెచ్‌సీఎల్ ఐటీ సిటీ లక్నోలో ఒక సెజ్‌ను, లోమా ఐటీ పార్క్ డెవలపర్ ముంబైలో, నార్త్ ముంబై ఇంటర్నేషనల్ కమోడిటీ టౌన్షిప్ ధానేలో సెజ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. మూడు సెజ్‌ల రద్దు ప్రతిపాదనలను బీఓఏ ఆమోదించింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్, హిందూస్తాన్ న్యూస్‌ప్రింట్‌లు... రద్దైన ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఐటీ సెజ్ ఏర్పాటు కోసం ఎమ్మార్ ఎంజీఎఫ్ 2012లోనే ఆమోదం పొందింది. అప్పటి నుంచి గడవును పొడిగించడం కానీ, ఈ సెజ్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కానీ ఏమీ చేయలేదు.